- నిజామాబాద్ జిల్లాలో 184 జీపీలు, కామారెడ్డి జిల్లాలో 167 జీపీల్లో ఎన్నికలు
- మండలానికో ఫ్లయింగ్ స్క్వాడ్ టీం
- ఉమ్మడి జిల్లాలో 28 మంది నోడల్ ఆఫీసర్లు
నిజామాబాద్/కామారెడ్డి, వెలుగు : పల్లె పోరుకు ఉమ్మడి జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. తొలి విడత ఎన్నికలకు నేటి నుంచి శనివారం వరకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్లోని 11 మండలాల్లో 184 జీపీలు, 1642 వార్డులు, కామారెడ్డి జిల్లా కామారెడ్డి డివిజన్లోని 10 మండలాల్లో 167 పంచాయతీలు, 1,520 వార్డుల్లో డిసెంబర్11న పోలింగ్ జరగనుంది.
నిజామాబాద్జిల్లాలో 1,653 పోలింగ్ సెంటర్లు, కామారెడ్డి జిల్లాలో 1,533 సెంటర్ల ఏర్పాట్లలో ఎన్నికలఅధికారులు నిమగ్నమయ్యారు. వెలుతురు, ఫర్నిచర్, కరెంట్, తాగునీరు, టాయిలెట్స్ వంటి ఏర్పాట్లు చేస్తున్నారు. సీఈసీ ఆదేశాల మేరకు ఓటర్ తుది జాబితాను గురువారం అన్ని పంచాయతీల్లో రిలీజ్
చేయనున్నారు.
సీనియర్ ఆఫీసర్స్‌కు వర్క్ డివిజన్
ఎన్నికలు ముగిసేవరకు ఎక్కడ చిన్న పొరపాటు జరగకుండా ఉమ్మడి జిల్లాలో 28 మంది నోడల్ ఆఫీసర్స్నియమించారు. ఎవరు ఏ బాధ్యతలు నిర్వర్తించాలో దిశానిర్దేశం చేశారు. ఎన్నికల నిబంధనలు అమలయ్యేలా ప్రతి మండలానికి ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ తిరుగనుంది. వ్యయ పరిశీలనకు మరో ఆఫీసర్‌ను మండలాల్లో నియమించారు. పోలింగ్ కోసం జంబో బాక్స్‌లు, చిన్న సైజు పెట్టెలు, పింక్, వైట్ బ్యాలెట్ పేపర్స్ సిద్ధంగా పెట్టారు.
కామారెడ్డి జిల్లాలో ఇలా..
మండలం జీపీలు నామినేషన్
సెంటర్లు
భిక్కనూరు 18 9
బీబీపేట 11 5
దోమకొండ 9 5
కామారెడ్డి 14 5
మాచారెడ్డి 25 7
పాల్వంచ 12 4
రాజంపేట 18 6
రామారెడ్డి 18 6
సదాశివనగర్ 24 8
తాడ్వాయి 18 7
నిజామాబాద్ జిల్లాలో ఇలా..
మండలం జీపీలు నామినేషన్
సెంటర్లు
బోధన్ 26 08
చందూర్ 05 02
కోటగిరి 16 04
మోస్రా 04 02
పోతంగల్ 20 05
రెంజల్ 17 05
రుద్రూర్ 11 04
సాలూరా 11 02
వర్ని 22 05
ఎడపల్లి 17 09
కామారెడ్డి జిల్లాలో నామినేషన్ల స్వీకరణ
మండలం సెంటర్లు
భిక్కనూరు భిక్కనూరు, రామేశ్వర్‌పల్లి, బస్వాపూర్, తిప్పాపూర్, జంగంపల్లి,
పెద్దమల్లారెడ్డి, మల్లుపల్లి, భాగీర్తిపల్లి, కాచాపూర్
బీబీపేట బీబీపేట, ఇస్సాన్నగర్, తూజాల్పూర్, యాడారం, మహమ్మదాపూర్
దోమకొండ దోమకొండ జీపీ, దోమకొండ ఎంపీడీవో ఆఫీసు, దోమకొండ ఈజేఎ,
ముత్యంపేట, అంబారిపేట
మాచారెడ్డి మాచారెడ్డి, గజ్యానాయక్‌తండా, చుక్కాపూర్, సోమార్పేట,
రత్నగిరిపల్లి, ఎల్లంపేట,
పాల్వంచ పాల్వంచ, ఫరీద్‌పేట, భవానిపేట, ఇసాయిపేట,
రామారెడ్డి రామారెడ్డి, రెడ్డిపేట, మద్దికుంట, పొశానిపేట, ఉప్పల్వాయి, అన్నారం.
రాజంపేట రాజంపేట, శివాయిపల్లి, తలమడ్ల, గుండారం, కొండాపూర్, ఆర్గొండ
కామారెడ్డి చిన్నమల్లారెడ్డి, క్యాసంపల్లి, నర్సన్నపల్లి, శాబ్దిపూర్, గర్గుల్
సదాశివనగర్ అడ్లూర్ఎల్లారెడ్డి, మక్కల్, సదాశివనగర్, పద్మాజివాడి, లింగంపేట,
ధర్మరావుపేట, ఉత్తునూర్, యాచారం.
తాడ్వాయి తాడ్వాయి, చిట్యాల, క్రిష్ణాజీవాడి, సంగోజివాడి,
తాడ్వాయి ఎంపీడీవో ఆఫీసు, కనకల్, నందివాడ
నిజామాబాద్ జిల్లాలో నామినేషన్ల స్వీకరణ
మండలం సెంటర్లు
బోధన్ అమ్దాపూర్, ఎరాజ్‌పల్లి, సంగం, పెంటాఖుర్దు క్యాంప్,
కల్దుర్కి, కొప్పర్గా, పెగడాపల్లి, పెంటాకలాన్
చందూర్ చందూర్, లక్ష్మాపూర్
కోటగిరి కోటగిరి, ఎత్తొండ, కొత్తపల్లి, అడ్కాస్పల్లి
మోస్రా మోస్రా, దుబ్బతండా, తిమ్మాపూర్
పోతంగల్ దోమలెడ్గి, కొల్లూర్, హంగర్గా ఫారం, కల్లూర్,, పోతంగల్
రెంజల్ కూనేపల్లి, రెంజల్, సాటాపూర్, నీల, వీరన్నగుట్ట
రుద్రూర్ అక్బర్‌నగర్, సులేమాన్ ఫారం, రాయ్కూర్, రుద్రూర్
సాలూరా సాలూరా, సాలంపాడ్
వర్ని వర్ని, శ్రీనగర్, జాకోరా, జలాల్పూర్, జలాల్పూర్ రైతు వేదిక
ఎడపల్లి ఏఆర్పీ క్యాంప్, ఎమ్మెస్సీ ఫారం, జైతాపూర్, జాన్కంపేట, నెహ్రూనగర్,
ఠాణాకలాన్,కుర్నాపల్లి, మంగల్‌పాడ్, ఎడపల్లి
నవీపేట నవీపేట, కోస్లీ, అభంగపట్నం, బినోల, జన్నేపల్లి,
నాగేపూర్, పోతంగల్, యంచ
