నేనో నిశ్శబ్దం..నాతో నాకే యుద్ధం

నేనో నిశ్శబ్దం..నాతో నాకే యుద్ధం

అతడు, ఖలేజా తర్వాత  మహేష్​ బాబు, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతోన్న మూడో చిత్రం  ‘గుంటూరు కారం’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌‌ బ్యానర్‌‌‌‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌‌. రీసెంట్‌‌గా మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. మంగళవారం త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ‘ధమ్ మసాలా’ అంటూ సాగే ఈ మూవీ ఫస్ట్ సాంగ్‌ను  రిలీజ్ చేశారు. తమన్ కంపోజ్ చేసిన మాస్ సాంగ్‌‌కు రామజోగయ్యశాస్త్రి ఆకట్టుకునే లిరిక్స్ రాశారు.

సంజిత్ హెగ్డే, జ్యోతి నూరన్ కలిసి పాడిన విధానం ఇంప్రెస్ చేస్తోంది. ‘నా తలరాతే రంగుల రంగోలి. దిగులైనా చేస్తా దీవాలి. నా నవ్వుల కోటని నేనే ఎందుకు పడగొట్టాలి.. నేనో నిశ్శబ్దం, అనునిత్యం నాతో నాకే యుద్ధం’ అంటూ మహేష్ క్యారెక్టర్‌‌‌‌ను ఎలివేట్‌‌ చేసేలా ఉన్న లిరిక్స్ ఫ్యాన్స్‌‌లో జోష్‌‌ని నింపుతున్నాయి.  జగపతి బాబు, జయరామ్, ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ  చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.