నా మాటల్ని లెక్కచేయలె.. అయినా నేనే గెలిచా

నా మాటల్ని లెక్కచేయలె.. అయినా నేనే గెలిచా

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శలకు దిగారు. దేశంలో కరోనా టీకా కొరతకు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. టీకా కొరత ఏర్పడటంతో విదేశీ వ్యాక్సిన్ లకు ఇప్పుడు ప్రభుత్వం ఆమోదం తెలుపుతోందని.. కానీ మరిన్ని టీకాలకు అనుమతి ప్రక్రియను వేగవంతం చేయాలని సర్కార్ కు తాను ముందే సూచించానన్నారు. అయితే తన సలహాను కేంద్రం పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. ఈ విషయంపై కేంద్రాన్ని విమర్శిస్తూ సెటైరికల్ గా తానే గెలిచానని అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. 'ముందు వాళ్లు మిమ్మల్ని పట్టించుకోరు. మిమ్మల్ని చూసి నవ్వుతారు. ఆ తర్వాత మీతో గొడవకు దిగుతారు. కానీ చివరికి మీరే గెలుస్తారు' అని రాహుల్ పేర్కొన్నారు. ఈ ట్వీట్ కు విదేశీ టీకాలకు అనుమతి ప్రక్రియను స్పీడప్ చేయాలనే వార్తా కథనాన్ని జోడించారు.