హైదరాబాద్ లో టీఎఎస్ ఆర్టీసీలో ఫస్ట్​ టైం స్లీపర్ బస్సులు

హైదరాబాద్ లో టీఎఎస్ ఆర్టీసీలో ఫస్ట్​ టైం స్లీపర్ బస్సులు

హైదరాబాద్, వెలుగు: టీఎస్ ఆర్టీసీలో ఫస్ట్​ టైం 10 నాన్ ఏసీ స్లీపర్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. వీటిని బుధవారం కేపీహెచ్​బీ కాలనీ బస్ స్టాప్​లో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ ప్రారంభిస్తారు. వీటిని హైదరాబాద్ నుంచి కాకినాడ, విజయవాడలకు హైర్ పద్ధతిలో నడపనున్నట్లు  మంగళవారం ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. 10 బస్సుల్లో నాలుగు స్లీపర్‌‌, మరో ఆరు స్లీపర్‌‌ కమ్‌‌ సీటర్‌‌ బస్సులున్నాయి. 

ప్రైవేట్‌‌ బస్సులకు దీటుగా అత్యాధునిక టెక్నాలజీతో వీటిని తయారు చేశారు. స్లీపర్‌‌ బస్సుల్లో లోయర్‌‌ బెర్తులు 15, అప్పర్‌‌ బెర్తులు 15 ఉంటాయని, మొత్తం 33 సీట్ల కెపాసిటీ, ప్రతీ బెర్త్‌‌ వద్ద వాటర్‌‌ బాటిల్‌‌ పెట్టుకునే ఫెసిలిటీతో పాటు మొబైల్‌‌ చార్జింగ్‌‌ సౌకర్యం, వైఫై, 3 సీసీ కెమెరాలు, లగేజ్ లోడింగ్ కు అటెండర్స్ ఉంటారని తెలిపింది.