నిజామాబాద్, వెలుగు : ఓటరు లిస్ట్ స్పెషల్ ఇంటెన్సివ్రివిజన్(సర్)పై ఫోకస్ పెట్టి సకాలంలో పూర్తి చేస్తామని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం ఎస్ఈసీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొని జిల్లా వివరాలు తెలిపారు. రూరల్ సెగ్మెంట్లో ఓటర్ల మ్యాపింగ్ పూర్తి చేశామని, అర్బన్ ఇతర సెగ్మెంట్ల్లో కూడా పూర్తి చేస్తామన్నారు. కాన్ఫరెన్స్లో అడిషనల్ కలెక్టర్లు అంకిత్, కిరణ్కుమార్, ఆర్డీవో రాజేంద్రకుమార్, నగర పాలక కమిషనర్ దిలీప్కుమార్తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణికి 68 ఫిర్యాదులు..
గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ముగిసిన నేపథ్యంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి పౌరుల నుంచి 68 ఫిర్యాదులు వచ్చాయి. అడిషనల్ కలెక్టర్కిరణ్కుమార్ పౌరుల నుంచి ఆర్జీలు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు.
