- ఆర్మూర్ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి వార్నింగ్
- కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ లో 52 బైక్ లు, 4 ఆటోలు స్వాధీనం
ఆర్మూర్, వెలుగు: రాత్రిపూట అనవసరంగా తిరిగితే కేసులు నమోదు చేస్తామని ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు. సోమవారం రాత్రి ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. దాదాపు70 మంది పోలీసులతో 120 ఇండ్లలో తనిఖీలు నిర్వహించి సరైన ధ్రువపత్రాలు లేని 52 బైక్ లు, 4 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని, ఈవ్ టీజింగ్, మహిళలను వేధించడం చేయొద్దని, గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.
ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఇండ్లను అద్దెకు ఇవ్వాలని, వారు ఎలాంటి నేరాలకు పాల్పడినా యజమానులపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్, ప్రొబేషనరీ ఐపీఎస్ సాయికిరణ్ , రూరల్‌సీఐ శ్రీధర్ రెడ్డి, ఆర్మూర్డివిజన్ లోని 9 మంది ఎస్ఐలు, ఏఎస్ఐలు, స్పెషల్ పార్టీ, రిజర్వ్, సిబ్బంది పాల్గొన్నారు.
