యూరియా కొరత లేకుండా చూడాలి : కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

యూరియా కొరత లేకుండా చూడాలి : కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

బోధన్, వెలుగు: జిల్లాలోయూరియా కొరత లేకుండా చూడాలని, స్టాక్ మొత్తం జీరో అయ్యేదాకా చూడొద్దని కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం బోధన్​ మండలం మావందిఖుర్దు విలేజ్ సింగిల్ విండో గోదాంలో యూరియా స్టాక్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందుబాటులో ఉన్న యూరియా వివరాలు రైతులకు తెలిసేలా స్టాక్​ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.

 ప్రైవేట్​ డీలర్లు విధిగా రూల్స్​పాటించేలా పర్యవేక్షణ చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. యాసంగిలో యూరియా షార్టేజ్ రాకుండా ముందస్తు ప్లాన్​తో యంత్రాంగం పనిచేయాలని చెప్పారు. ఆయన వెంట డీఏవో వీరాస్వామి తదితరులు ఉన్నారు.