రాష్ట్రస్థాయి చెస్ విజేతలుగా బోధన్ గురుకుల విద్యార్థులు

 రాష్ట్రస్థాయి చెస్ విజేతలుగా బోధన్ గురుకుల విద్యార్థులు

బోధన్​, వెలుగు: జనగామ జిల్లా కేంద్రంలో ఈ నెల 17నుంచి 20వరకు నిర్వహించిన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల 11వ రాష్ట్రస్థాయి చెస్ పోటీల్లో బోధన్ పట్టణశివారులోని బెల్లాల్​ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్, వ్యాయామ ఉపాధ్యాయుడు మోతీలాల్ తెలిపారు. జనగామలో నిర్వహించిన ఈపోటీల్లో చెస్ అండర్--14 విభాగంలో ఎం.శివకుమార్, అండర్--17 విభాగంలో జంగం.

రవివర్మ ఉత్తమ ప్రతిభ కనబరిచారని తెలిపారు. ఈమేరకు సోమవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజేతలను సన్మానించి, అభినందించారు. కార్యక్రమంలో పీఈటీ జ్ఞానేశ్వర్, ఉపాధ్యాయులు రమేశ్, చారి తదితరులు పాల్గొన్నారు.