
మీకు డబ్ల్యూడబ్ల్యూఈ అంటే ఇష్టమా..? రెజ్లర్ల పోటీపడుతున్న దృశ్యాలను ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నారా! అయితే మీకో శుభవార్త. సెప్టెంబర్ 8న గచ్చిబౌలిలోని GMC బాలయోగి ఇండోర్ స్టేడియం వేదికగా డబ్ల్యూడబ్ల్యూఈ ఈవెంట్ జరగనుంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు.
అంతర్జాతీయంగా ఖ్యాతి పొందిన 28 మంది డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్స్ ఈ ఈవెంట్‌లో పోటీ పడనున్నారు. ప్రపంచ హెవీవెయిట్ ఛాంపియన్ సేత్ 'ఫ్రీకిన్' రోలిన్స్ సహా మహిళల వరల్డ్ ఛాంపియన్ రియా రిప్లే, డబ్ల్యూడబ్ల్యూఈ ట్యాగ్ టీం ఛాంపియన్స్ సామి జాయన్, కెవిన్ ఓవెన్స్ తోపాటు జిందర్ మహల్, డ్రూ మెకింటైర్, బెక్కీ లించ్, నటాల్యా, మ్యాట్ రిడిల్, లూడ్‌విగ్ కైసర్ తదితరులు హైదరాబాద్‌కు రానున్నట్లు తెలుస్తోంది.
Unveiled the wall poster of 2nd “Superstar Spectacle 2023”, a professional wrestling event produced by the American company WWE.
— V Srinivas Goud (@VSrinivasGoud) August 13, 2023
The event will take place on 8th September at the GMC Balayogi Indoor Stadium in Gachibowli & will feature WWE Superstars in action including: World… pic.twitter.com/iPq7i2fpp6
దేశంలోనే రెండోసారి ఈ ఈవెంట్ నిర్వహిస్తుండగా.. హైదరాబాద్ తొలిసారి ఆతిథ్యం ఇవ్వనుంది. ఆన్‌లైన్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ www.bookmyshow.comలో టికెట్లు అందుబాటులో ఉన్నాయి. మరింత సమాచారం కోసం www.wwe.comను సంప్రదించవచ్చు.
Get your tickets now to watch The King of Claymore Country @DMcIntyreWWE in action at #WWESuperstarSpectacle, LIVE in Hyderabad! (Link in bio) @BookMyShow @WWE @SonySportsNetwk #WWEIndia #WWELive pic.twitter.com/XCBLqdtYVg
— WWE India (@WWEIndia) August 9, 2023