భారత నేవీలోకి మొదటి మహిళా పైలెట్

భారత నేవీలోకి మొదటి మహిళా పైలెట్

అందివచ్చిన అన్ని అవకాశాల్లోనూ సత్తా చాటుతున్నారు మహిళలు. ప్రతీ రంగంలోనూ తమ మార్క్ ను చూపిస్తున్నారు. ఒకప్పుడు పురుషులకు మాత్రమే కేటాయించిన ఉద్యోగాల్లో ఇప్పుడు మహిళలకు అవకాశం కల్పించడంతో…వారితో పాటు సమానంగా ఉద్యోగంలో దూస్కెళ్తున్నారు. లేటెస్టుగా భారత నౌకాదళంలోకి కూడా మొదటి సారిగా మహిళా పైలట్‌ రాబోతున్నారు. నేవీ లెఫ్టినెంట్‌గా శివాంగి డోర్నియర్ అనే యువతికి ఈ అవకాశం దక్కింది.

ఇప్పటి వరకు నేవీ ఏవియేషన్ బ్రాంచ్ మహిళలు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆఫీసర్లు,కమ్యూనికేషన్ ,ఆయుధాలకు బాధ్యత వహించే విధులు నిర్వహించేవారు. ఇప్పుడు లెఫ్టినెంట్ శివాంగికి విమానాలను నడిపే అవకాశం లభించింది.

బీహార్  ముజఫర్‌పుర్‌‌కు చెందిన శివాంగి నేవీలో ట్రైనింగ్ శిక్షణ పూర్తి చేసుకున్నారు. డిసెంబర్ 2న ఆమె కొచ్చిలో విధుల్లో జాయిన్ కానున్నారు. దీంతో నేవీలో తొలి మహిళా పైలట్‌గా రికార్డు సాధించారు. ఎజిమాలాలోని ఇండియన్ నావల్ అకాడమీలో 27 NOC కోర్సు చేసి పైలెట్‌గా ఎంపికయ్యారు శివాంగి డోర్నియర్.