
ముషీరాబాద్, వెలుగు: మృగశిర కార్తె నేపథ్యంలో ముషీరాబాద్‌లోని రాంనగర్ ఫిష్ మార్కెట్‌కు బుధవారం రాత్రి కంటైనర్లు, డీసీఎంలు, లారీలు, ఆటోల్లో భారీగా చేపలు వచ్చాయి. ఫిష్ మార్కెట్ మార్కెట్ రోడ్లన్నీ వెహికల్స్‌తో కిక్కిరిశాయి.
మృగశిర కార్తె మొదటి రోజున చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని నమ్ముతారు. డిమాండ్దృష్టిలో పెట్టుకొని వ్యాపారులు అధిక మొత్తంలో చేపలను మార్కెట్‌కు తరలించారు.