జూన్‌ 8,9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ

జూన్‌ 8,9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో జూన్‌ 8వ తేదీ సాయంత్రం నుంచి చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు బత్తిని మృగశిర ట్రస్ట్‌ కార్యదర్శి బత్తిని హరనాథ్‌ గౌడ్‌ తెలిపారు. ఈ పంపిణీ కార్యక్రమం 8న సాయంత్రం 6 గంటల నుంచి 9న సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు. గతేడాది 4లక్షల మందికి ప్రసాదం పంపిణీ చేశామన్నారు.

1845లో తమ ముత్తాత వీరన్న హయాం నుంచి ఈ చేప ప్రసాదం పంపిణీని కొనసాగిస్తున్నట్లు హరనాథ్ గౌడ్ తెలిపారు. చేప ప్రసాదం కోసం ఎంతమంది వచ్చినా అందరికీ ఇస్తామని.. ఎవరికీ అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు బత్తిని హరనాథ్‌ గౌడ్‌.