పోటాపోటీగా చెరువులో చేప పిల్లలు విడుదల

పోటాపోటీగా చెరువులో చేప  పిల్లలు విడుదల

ఆర్మూర్, వెలుగు:  ఆర్మూర్ టౌన్​ లోని గూండ్ల చెరువులో సోమవారం చేప పిల్లలను వదిలారు.ఆర్మూర్​ ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి చేప పిల్లలను వదిలిన కొద్ది సేపటికే ఆర్మూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్​ సాయిబాబా గౌడ్​ కాంగ్రెస్ నాయకులతో కలిసి చేప పిల్లలను వదిలారు. డీసీసీబీ డైరెక్టర్ న్యాలకంటి వాసు, కాంగ్రెస్ నాయకులు వెంకటగిరి, భూపెందర్, రాజు, చిట్టి రెడ్డి, ప్రసాద్,భగత్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

చెరువు భూములు కబ్జా కాకుండా చూసుకోవాలి: ఎమ్మెల్యే పైడి రా కేశ్​రెడ్డి 

చెరువు భూములు కబ్జా కాకుండా  చూసుకోవాలని ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి అన్నారు.  గంగపుత్రుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీపై చేప పిల్లలు పంపిణీ చేస్తుందన్నారు. అనంతరం జిరాయత్​ నగర్​లోని మండల పరిషత్ ప్రైమరీ స్కూల్​ను పరిశీలించిన ఎమ్మెల్యే అదనపు తరగతి గదులు, టాయిలెట్స్ ను నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే వెంట గంగపుత్ర సంఘం జిల్లా ప్రెసిడెంట్ బింగి పెంటయ్య, బీజేపీ టౌన్​ ప్రెసిడెంట్ మందుల బాలు, పోల్కం వేణు, కలిగోట గంగాధర్, భరత్, ఉదయ్ గౌడ్, సుంకరి రంనగ్న తదితరులు ఉన్నారు.