- ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, హరశ్రావు, కేటీఆర్‌లను ఒక్కసారి కాదు.. వందసార్లు ఉరితీయాలని ఫిషరీస్ కార్పొరేషన్‌చైర్మన్ మెట్టు సాయికుమార్ తెలిపారు. ఈ మేరకు సోమవారం అసెంబ్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వాదాన్ని, ఉద్యమ కారులను అవమానించింది వారేనని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆత్మాభిమానం తాకట్టు పెట్టారంటూ మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఉసురు, కన్నీటితో భస్మం కాక తప్పదని హెచ్చరించారు.
బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరిక..
ఖమ్మం కార్పొరేషన్‌కు చెందినబీఆర్ఎస్ కార్పొరేటర్లు సోమవారం గాంధీ భవన్ లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు. గోళ్ల చంద్రకళ, డోనవన్ సరస్వతి, దాదే అమృతమ్మ, చిరుమామిళ్ల లక్ష్మి, మోతారపు శ్రావణి కాంగ్రెస్‌లోచేరారు.
