లాక్డౌన్ వల్ల ఆన్‌లైన్‌లోకి ఫిట్​నెస్ క్లాసులు

లాక్డౌన్ వల్ల ఆన్‌లైన్‌లోకి ఫిట్​నెస్ క్లాసులు

హైదరాబాద్, వెలుగు: ఫిట్​నెస్​… యంగ్​స్టర్స్ నుంచి మిడిల్ ఏజ్ వాళ్ల వరకూ ఇదో డైలీ ప్రాసెస్. రెగ్యులర్ గా జిమ్ కి వెళ్లి వర్కవుట్స్ చేసేవారు ఒక్కరోజు గ్యాప్ వచ్చినా డే అంతా డల్​గా ఉంటారు. లాక్ డౌన్ రిలాక్సేషన్స్ లోనూ జిమ్​లు, ఫిట్​నెస్​ సెంటర్లకు పర్మిషన్ లేకపోవడంతో సిటిలో ఆన్ లైన్ ఫిట్​నెస్​ క్లాసెస్ లకు డిమాండ్ పెరిగింది. దాంతో ట్రైనర్స్ ఆన్ లైన్ వీడియో సెషన్స్ కండక్ట్ చేయడంతోపాటు వర్కవుట్ వీడియోస్ క్రియేట్ చేసి మెంబర్స్ కి పంపిస్తున్నారు.

లాక్ డౌన్ ఎఫెక్ట్ తో..

లాక్ డౌన్ తో 2నెలల పాటు ఇంట్లోనే ఉండి వెయిట్ పెరిగిన వారు, గతంలో వర్కవుట్స్ చేయని వారు ఆన్ లైన్ క్లాసెస్ కి అప్లయ్ చేసుకుంటున్నారు. లాక్ డౌన్ ఫస్ట్ ఫేజ్ తర్వాత నుంచి అలాంటి వారి సంఖ్య పెరిగింది. జాబ్, ఇతర పనుల వల్ల జిమ్​కి వెళ్లడం కుదరని వారు ఈ టైమ్​ని యుటిలైజ్ చేసుకుంటున్నారు. ఫిట్​గా ఉండేందుకు జాయిన్ అయ్యే వారి కంటే వెయిట్, బెల్లీ ఫ్యాట్ తగ్గించుకునేందుకు కన్సల్ట్ అయ్యే వారే 90శాతానికి పైగా ఉన్నట్లు పర్సనల్ ఫిట్​నెస్​ ట్రైనర్స్ చెప్తున్నారు.

సెపరేట్ ట్రైనింగ్, డైట్ ప్లాన్స్

జిమ్, ఫిట్​నెస్​ సెంటర్ లో జాయిన్ అయ్యేవారికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. చాలామంది ఫిట్ గా ఉండేందుకు, స్ట్రెస్, వెయిట్ తగ్గించుకునేందుకు, బాడీ బిల్డింగ్,హెల్దీ లైఫ్ స్టైల్ కోసం వెళ్తుంటారు. కొందరు పర్సనల్ ట్రైనర్ ని పెట్టుకుంటారు. అలాంటి వారి ప్రాబ్లమ్, తీసుకున్న ప్యాకేజ్ ని బట్టి ఎలాంటి వర్కవుట్స్, డైట్ ఫాలో అవ్వాలో ట్రైనర్స్ ప్లాన్ ఇస్తుంటారు. ప్రస్తుతం ఆన్ లైన్ ఫిట్​నెస్​ సెషన్స్ కి అటెండ్ అయ్యేవారికి కూడా అలాంటి ట్రైనింగే ఇస్తున్నారు. అప్లికేషన్ లో ఏజ్, జెండర్, హెల్త్ ఇష్యూ, హైట్, వెయిట్ డీటెయిల్స్ ఫిల్ చేయిస్తున్నారు. ఆ ప్రకారమే ట్రైనర్స్ క్లయింట్స్ కి వర్కవుట్స్, డైలీ డైట్ ప్లాన్ వాట్సాప్ లో సెండ్ చేస్తున్నారు. డైటీషియన్ ను క్లయింట్ కి టచ్ లో ఉంచుతున్నారు. పర్సనల్ ట్రైనర్స్ వర్కవుట్స్ చేసి దాన్ని వీడియో రికార్డింగ్ చేసి వాట్సాప్, ఇ–మెయిల్ లో సెండ్ చేస్తున్నారు. అందుకు ట్రైనర్ ని బట్టి నెలకి రూ. 4 వేల నుంచి 10 వేలకు పైగా తీసుకుంటున్నారు.

లైవ్ సెషన్స్..

కల్ట్ ఫిట్, క్యూర్ ఫిట్, ఫిట్టర్ నిటి, పేటీఎం లాంటి ఫిట్​నెస్​ సెంటర్స్ తమ క్లయింట్స్ కోసం ఆన్ లైన్ మీటింగ్ యాప్స్ ద్వారా లైవ్ వర్కవుట్ సెషన్స్ కండక్ట్ చేస్తున్నాయి. అందులో డిఫరెంట్ ప్యాకేజీలుంటాయి. ఒకేసారి 50 మందికి క్లాస్ కండక్ట్ చేస్తారు. వాటికి అటెండ్ కావాలనుకుంటే మంత్లీ ఫీజు రూ.10 వేల వరకు ఉంటుంది. ఈ క్లాసెస్ డే బై డే ఉంటాయి. ప్రతి క్లాస్ 40 నిమిషాల నుంచి గంట వరకు ఉంటుంది. జుంబా, ఎరోబిక్స్, యోగా, ఎక్సర్ సైజ్ వంటి డిఫరెంట్ సెషన్స్ ఉంటాయి. పేటీఎం లాంటి ఫిట్​నెస్​ సెంటర్స్ సెలబ్రిటీలతో లైవ్ వర్కవుట్ క్లాసెస్ కండక్ట్ చేస్తాయి. ఫిట్​నెస్​ ఎక్కువగా ఫాలో అయ్యే సెలబ్రిటీలను తీసుకుని వారితో వారానికి డిఫరెంట్ సెషన్స్ ప్లాన్ చేస్తున్నాయి. వాటికి అటెండ్ అవ్వాలంటే ఫీజు రూ.499 ఉంటుంది. రెగ్యులర్ ఫిట్​నెస్​ ఫ్రీక్స్ కి, లాక్ డౌన్ తో జాయిన్ అవుతున్న వారికి ఈ ఆన్ లైన్ సెషన్స్ బాగా యూజ్ అవుతున్నాయి.

మెంబర్స్ పెరుగుతున్నరు..

లాక్ డౌన్ తో రెగ్యులర్ క్లయింట్స్ కి ఆన్ లైన్ లో ట్రైనింగ్ ఇస్తున్నాం. లాక్ డౌన్ సెకండ్ ఫేజ్ తర్వాత 100మందికిపైగా కొత్తవాళ్లు జాయిన్ అయ్యారు. మా వెబ్ సైట్ లో ఆన్ లైన్ ఫాం ఫిలప్ చేసి ట్రైనింగ్ తీసుకుంటున్నారు. వెయిట్ పెరగడం, లావుగా కనిపించడం లాంటి ప్రాబ్లమ్స్ తో చాలామంది అప్రోచ్ అయ్యారు. వారికి సెపరేట్ వర్కవుట్ సెషన్స్, డైట్ ప్లాన్స్ ఇచ్చాం. రెగ్యులర్ గా టచ్ లో ఉంటాం. మార్నింగ్ టు ఈవెనింగ్ క్లయింట్ కి వీలున్న టైమ్ లోనే వర్కవుట్స్ చేయమని చెప్తున్నాం. సెలబ్రిటీలకూ లైవ్ సెషన్స్ ద్వారా ట్రైనింగ్ ఇస్తున్నాం.

– వెంకట్ మడమల,

సెలబ్రిటీ ఫిట్ నెస్ ట్రైనర్, టార్క్ ఫిట్ నెస్ జిమ్ సెంటర్

For More News..

కొడుకును చంపి తల్లి సూసైడ్

కరోనా భయంతో తల్లిని కూడా ఇంట్లోకి రానివ్వలె!

తల్లిదండ్రులు భార్యను వేధిస్తున్నారని.. ఆమెతో కలిసి సూసైడ్ చేసుకున్న భర్త

కరోనా గురించి మామను కోల్పోయిన అల్లుడి సోషల్ మీడియా పోస్ట్