రేపు (జూన్ 22) కోహ్లీకి ఫిట్నెస్ టెస్ట్‌‌‌‌

రేపు (జూన్ 22) కోహ్లీకి ఫిట్నెస్ టెస్ట్‌‌‌‌

న్యూఢిల్లీ: తొడ కండరాల గాయం నుంచి కోలుకుంటున్న స్టార్‌‌‌‌ బ్యాటర్‌‌‌‌ విరాట్‌‌‌‌ కోహ్లీకి సోమవారం ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ పరీక్ష నిర్వహించనున్నారు. లండన్‌‌‌‌లో తన కుటుంబంతో కలిసి ఉంటున్న కోహ్లీ ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ను పరిశీలించేందుకు బీసీసీఐ స్పోర్ట్స్ సైన్స్ బృందం అక్కడికి వెళ్లింది. 

మరోవైపు ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ హార్దిక్‌‌‌‌ పాండ్యా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. మోకాలి కండరాల గాయానికి గురైన హార్దిక్‌‌‌‌ వన్డే ఫార్మాట్‌‌‌‌కు అవసరమైన పూర్తి ఓవర్లు వేయలేకపోతున్నాడు. దీంతో ఇంగ్లండ్‌‌‌‌తో జరిగే వన్డే సిరీస్‌‌‌‌కు అతను పూర్తిగా దూరమయ్యాడు.