దేశంలో ఐదు మంకీపాక్స్ కేసులు

దేశంలో ఐదు మంకీపాక్స్ కేసులు

న్యూఢిల్లీ : దేశంలో మంకీపాక్స్‌‌‌‌ వ్యాప్తిపై మానిటర్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ను ఏర్పాటు చేసింది. వైరస్‌‌‌‌ను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ టాస్క్‌‌‌‌ఫోర్స్ సూచనలు చేయనుంది. దేశంలో టెస్టింగ్ సౌకర్యాలను పెంచడం పైనా ప్రభుత్వానికి గైడ్‌‌‌‌లైన్స్ ఇవ్వనుంది. ఈ వ్యాధికి టీకాలు వేయడానికి సంబంధించిన అంశాలపైనా స్టడీ చేయనుంది. ఈ టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌కు చీఫ్‌‌‌‌గా నీతి ఆయోగ్ మెంబర్ (హెల్త్) వీకే పాల్ వ్యవహరిస్తారు. కాగా కేరళకు చెందిన 22 ఏండ్ల యువకుడు గత వారంలో చనిపోయాడు. అతడికి టెస్టులు చేయగా మంకీపాక్స్ పాజిటివ్‌‌‌‌గా తేలింది. ఇప్పటిదాకా దేశంలో ఐదు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా 75 దేశాల్లో 16 వేలకు పైగా కేసులు వచ్చాయి.