ఒకే చోట రెండు ప్రమదాలు..ఐదుగురు మృతి

ఒకే చోట రెండు ప్రమదాలు..ఐదుగురు మృతి

అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం హైవేపై శుక్రవారం రాత్రి ఒకే చోట రెండు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదంలో మొత్తం ఐదుగురు చనిపోయారు. టూ వీలర్ వెహికల్ పై వెళ్తున్న ఓ యువకుడిని కారు ఢీ కొట్టడంతో ఆ యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన స్థానికులపై  అనంతపురం నుంచి కదిరి వెళ్తున్న  లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలోమరో నలుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గాయపడ్డ వ్యక్తులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.