- ఐదుగురు విదేశీయులు అరెస్ట్
మాదాపూర్, వెలుగు: ఓ వ్యభిచార గృహంపై దాడి చేసి, ఐదుగురు విదేశీయులను పోలీసులు అరెస్ట్‌చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్న్యూహఫీజ్పేట పరిధి సుభాష్ చంద్రబోస్నగర్లోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు మంగళవారం సమాచారం అందింది.
వారు ఎస్వోటీ పోలీసులతో కలిసి దాడి చేశారు. నలుగురు మహిళలతోపాటు నిర్వాహకుడు లైబీరియా దేశానికి చెందిన డేరియస్ ను అరెస్ట్ చేశారు. మహిళల్లో ఇద్దరు కెన్యా, మరో ఇద్దరు ఉగాండా దేశస్థులు. డేరియస్2021లో విద్యాభ్యాసం కోసం నగరానికి వచ్చాడని తెలిపారు. అతన్ని రిమాండ్‌కు, మహిళలను రెస్క్యూ హోమ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
