
గజ్వేల్ రూరల్, వెలుగు: గజ్వేల్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ కుటుంబం నుంచి కౌన్సిలర్లుగా ఐదుగురు బరిలో ఉన్నారు. 15వ వార్డులో గాడిపల్లి భాస్కర్, 11వ వార్డులో భాస్కర్ భార్య కళ్యాణి, అదే వార్డులో తమ్ముడు భార్య పద్మ, మరో తమ్ముడు భార్య అమృత, 10వ వార్డు నుంచి తమ్ముడు విజయ్ కుమార్ పోటీ చేస్తున్నారు.
పోటీలో భార్యభర్తలు
ఇల్లందు, వెలుగు: ఇల్లందు పురపాలక పోరులో మునుపెన్నడు లేనివిధంగా ఈసారి భార్యభర్తలు పలు వార్డుల్లో నామినేషన్లు వేశారు. పురపాలక మాజీ చైర్ పర్సన్ మడత రమా వెంకట్ గౌడ్ , భర్త వెంకట్ గౌడ్ 8, 11 వార్డుల్లో తెరాస తరఫున రెండు చొప్పున నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 11వ వార్డులో సుదర్శన్ కోరి, భార్య సోనిబాయి 15వ వార్డు నుంచి నామినేషన్ వేశారు.