
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలకు రాకుమారుడు బుధుడు. గ్రహాలలో యువరాజుగా పరిగణించే బుధుడిని తెలివికి, వ్యాపారానికి ప్రతీకగా పరిగణిస్తారు. అంతటి ప్రాధాన్యత ఉన్న బుధుడు జులై 24 సాయంత్రం 7:42గంటలకు సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని ప్రభావంతో ద్వాదశ రాశులపై ప్రభావం పడుతుంది. దీని ప్రభావం మొత్తం 12 రాశులపై మంచి చెడుల ప్రభావాన్ని చూపిస్తుంది. బుధుడు .. సింహ రాశిలో సంచారం వలన ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
మేషరాశి : బుధుడు... సింహరాశిలో సంచారం వలన ఈ రాశి వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థికపరంగా సమస్యలు రావచ్చు. పనిలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశాలున్నాయి. ఇక వ్యాపారస్తులు ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలి. ఎవరితో వాదనలు పెట్టుకోవద్దు. ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా.. మీ పనులు మీరు చేసుకోండి. రిలేషన్‌షిప్‌లో కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొన్ని పరిస్థితులు కారణంగా కారణంగా మానసిక అశాంతికి గురి అయ్యే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
వృషభరాశి : బుధుడు సంచారంలో మార్పు ఈ రాశి వారికి బాగా అనుకూలంగా ఉంటుంది. గతంలో ఉన్న వివావాలు పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. నిరుద్యోగులు శుభవార్త వింటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెడితే లాభాలు కలుగుతాయి. పూర్వీకుల ఆస్థి కలసి వస్తుంది. ఈ టైమ్ లో మీరు తీసుకునే నిర్ణయం లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. అంతా మంచే జరుగుతుంది. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రేమ... పెళ్లి వ్యవహారాలు కలసివస్తాయి.
మిథునరాశి: ఈ రాశి వారికి బుధుడు... సింహరాశిలో సంచారం వలన ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. రిస్క్ విషయాల జోలికి వెళ్లవద్దు. వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త ఒప్పందాలు చేసుకోవద్దు. కేరీర్ విషయంలో అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. స్థాన చలనం కలిగే అవకాశం ఉంది. మీ ప్రమేయం లేకుండా.. మాట పడాల్సిన పరిస్థితి ఉంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోండి. అనవసర ఖర్చులను నియంత్రించుకోండి. ప్రతి విషయంలో ఓర్పు .. సహనం పాటించండి..
కర్కాటకరాశి : జులై 24న బుధుడు.. .. సింహరాశిలోకి ప్రవేశించడంతో ఈ రాశి వారికి అంతా అనుకూలంగా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు చేసే వారు గుడ్ న్యూస్ వింటారు. ఉద్యోగస్తులు ఆఫీసులో మీరే చక్రం తిప్పుతారు. ప్రమోషన్ తో వేతనం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. గతంలో నెలకొన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
సింహరాశి : బుధుడు .. రాశి మార్పు వలన ఈ రాశి వారికి చిన్నపాటి సమస్యలు రావచ్చు. ఈ సమయంలో ఈ రాశి వారు కష్టానికి తగ్గ ఫలితం కూడా పొందలేరు. . వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయినా ఏ మాత్రం నిరుత్సాహం చెందకండి. ఆలస్యంగా మీరు తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండండి. అనవసరమైన వాటిని ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగస్తుల విషయంలో బదిలీ జరిగే అవకాశం ఉంది. ఇది గందరగోళాన్ని పెంచుతుంది. వ్యాపారంలో ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవద్దు. డబ్బును ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.
కన్యారాశి : బుధుడు... సింహరాశిలో సంచారం వలన ఈ రాశి వారికి ప్రయాణం చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త పరిచయస్తుల నుంచి కోరుకున్న విధంగా మద్దతు లభించదు. కెరీర్‌లో సీనియర్లతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపారంలో నిర్ణయాలు తీసుకోవడంలో సందేహం ఉంటుంది. ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంది. ఆదాయం, వ్యయాన్ని సమతుల్యం చేసుకోవడం సవాలుగా ఉంటుంది. ఎలాంటి ఆందోళన చెందకుండా ఉండండి. మీ జీవిత భాగస్వామినిర్ణయం తీసుకోండి. గందరగోళ పరిస్థితులకు ఉపశమనం కలుగుతుంది.
తులారాశి : బుధుడు స్థానచలనం వలన .. ఈ రాశి వారికి శుభదాయకంగా ఉంటుంది. కెరీర్ విషయంలో కొత్త అవకాశాలను అందుకునే అవకాశం ఉంది. ప్రమోషన్వచ్చే అవకాశం ఉంది. కష్టపడి పనిచేయడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబంలో శాంతి, సంతోషాల వాతావరణం నెలకొంటుంది. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. గతంలో పెట్టిన పెట్టుబడులకు అధికంగా లాభాలు కలుగుతాయి. సమాజంలో గౌరవం.. కీర్తి.. ప్రతిష్టలు పెరుగుతాయి. అంతా మంచే జరుగుతుంది. ఎలాంటి ఆందోళన అవసరం లేదు.
వృశ్చిక రాశి: బుధడు. సింహరాశిలో ప్రవేశం వలన ఈ రాశి వారికి కొత్త ఉత్సాహం లభిస్తుంది. సమాజంలో గౌరవం.. కీర్తి.. ప్రతిష్టలు పెరుగుతాయి. విదేశీ ప్రయాణం కలసి వస్తుంది. ఉద్యోగస్తులకు అధికారులనుంచి ప్రశంశలు వస్తాయి. కేరీర్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కొత్త ప్రాజెక్ట్లు చేపట్టే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఊహించని లాభాలు కలుగుతాయి. ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
ధనస్సు రాశి : ఈ రాశి వారికి గతంలో ఆగిపోయిన పనుల్లో ఇప్పుడు విజయం సాధిస్తారు. అనుకోకుండా ధనలాభం కలిగే అవకాశం ఉంది. గత సమస్యలు పరిష్కారమవుతాయి. కొత్త పెట్టుబడుల విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. తోటి ఉద్యోగుల అండదండలు పుష్కలంగా ఉంటాయి. అంతా మంచే జరుగుతుంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.
మకరరాశి : ఈ రాశి వారికి జులై 24 నుంచి ఆగస్టు 9 వతేది వరకు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించండి. ఈ రాశి వారు చేపట్టిన పనులు ఎలాంటి ఆటంకం లేకుండా సాగిపోతాయి. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు విజయవంతమవుతాయి. శుభకార్యాలు ఇంట్లోనే నిర్వహించుకోవచ్చు. భూమి, వాహనం కొనుగోలుకు అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది.
కుంభరాశి : ఈ రాశి వారు అనుకోకుండా ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. నిరుద్యోగులు గుడ్ న్యూస్వింటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. కెరీర్ విషయంలో శుభవార్త వింటారు. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. . కెరీర్ లో కూడా సర్ప్రైజ్ పొందే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
మీనరాశి: బుధుడు... సింహరాశిలో ప్రవేశించడం వలన ఈరాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. ఆరోగ్యం పట్ల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్థిక పరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు ఎవరితోను వాదన పెట్టుకోవద్దు. మీపని మీరు చేసుకోండి. ఈ సమయంలో ఈ రాశి వారు కోరుకున్న ఉద్యోగంలో ఆలస్యం రావచ్చు వ్యాపారంలో కూడా మీపై ఒత్తిడి ఎక్కువ పడే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.