
ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పేర్లు మారనున్నాయి. చాలా రోజులుగా జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులను మార్చాలని డిమాండ్ వస్తుండటంతో.. జిల్లాల పేర్లు, సరిహద్దుల్లో మార్పు చేర్పులపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ మంగళవారం (జులై 22) ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉప సంఘం జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు మార్పులు, చేర్పులపై అధ్యయనం చేయనుంది. కొన్ని చోట్ల జిల్లా కేంద్రాలను మార్చాలని, మరికొన్ని చోట్ల తమను పాత జిల్లాల్లోనే కొనసాగించాలని డిమాండ్లు కొనసాగుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో ప్రస్తుత సీఎం చంద్రబాబుకు ఆయా జిల్లాల్లోని స్థానికులు విజ్ఞప్తులు చేశారు.
►ALSO READ | ఇకనుంచి ఒంటిమిట్ట ఆలయంలో నిరంతరం అన్నప్రసాదాలు.. ధర్మకర్తల సమావేశంలో టీటీడీ కీలక నిర్ణయాలు
నూజివీడు, కైకలూరు నియోజకవర్గాలను కృష్ణా జిల్లాలోనే ఉంచాలనే డిమాండ్లున్నాయి. ప్రస్తుతం నూజివీడు, కైకలూరు నియోజకవర్గాలు ఏలూరు జిల్లా పరిధిలో ఉన్నాయి. ఇక అన్నమయ్య జిల్లాకు రాయచోటి కాకుండా.. రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ వస్తోంది.
అయితే స్థానికులు మాత్రం రాయచోటినే కొనసాగించాలని కోరుతున్నారు. ఆయా జిల్లాలకు కొందరి ప్రముఖ నేతల పేర్లు పెట్టాలని మరికొన్ని డిమాండ్లు వస్తున్నాయి. దీంతో వీటికి ఒక పరిష్కారం తీసుకురావాలనే ఉద్దోశంతో సబ్ కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం.