
ఎంతైనా మానవ మేధస్సు.. మానవ మేధస్సే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక.. మానవ మేధస్సుతో పనిలేదు అనుకుంటున్న సందర్భం ఇది. అయితే ఎంతో అభివృద్ధి చెందుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)కూడా మానవ మేధస్సుతో ఇంకా పోటీ పడలేకపోయింది.
ఇటీవలి జరిగిన అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్ (IMO)లో మానవ టీనేజర్లు AI మోడల్‌లను ఓడించారు. ఈ పోటీలో గూగుల్ ,ఓపెన్ఏఐ అభివృద్ధి చేసిన జనరేటివ్ AI మోడల్‌లు మానవ మేధస్సు చేతిలో ఓడిపోయినప్పటికీ అవి మొదటిసారి గోల్డెన్ లెవెల్ స్కోర్లను సాధించాయి. ఇది వాటి అభివృద్ధి వేగం, మానవ సామర్థ్యాలు,AI భవిష్యత్తు గురించి ఆలోచింపజేస్తోంది.
గతేడాది మానవ మేధస్సుకంటే చాలా వెనకబడి ఉన్న AI మోడల్స్ ఈ ఏడాది గణనీయంగా పుంజుకున్నాయి. AI దాని ఆలోచనా ప్రక్రియలను వివరించే సామర్థ్యంలో పురోగతిని సాధించాయి.ఈ డెవలప్ మెంట్ భవిష్యత్తులో పరిష్కారం కాని పరిశోధన సమస్యలను పరిష్కరించడంలో AI ,గణిత శాస్త్రజ్ఞుల మధ్య సహకారానికి ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు.
66వ వార్షిక అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్ ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌లో జరిగింది. ఇక్కడ 112 దేశాల నుంచి641 మంది యువకులు పోటీ పడ్డారు. మొదటిసారిగా గూగుల్ జెమిని డీప్ థింక్ లేటెస్ట్ వెర్షన్, ఓపెన్‌ఏఐ నుంచి ప్రయోగాత్మక AI తార్కిక నమూనాలు మానవ మేధస్సుతో పోటీ పడ్డారు.
►ALSO READ | యూట్యూబ్ సంచలన నిర్ణయం.. వేలాది చైనా,రష్యా ఛానెళ్ల తొలగింపు
ఈ పోటీల్లో AI గోల్డ్ లెవెల్ స్కోర్లు సాధించింది.Google, OpenAI AI మోడల్‌లు రెండూ 4.5 గంటల టైంలో 6 సమస్యలలో 5 సమస్యలను పరిష్కరించగలిగాయి. గరిష్టంగా 42 పాయింట్లలో 35 పాయింట్లు సంపాదించాయి . ఈ స్కోరు IMOలో గోల్డ్ మెడల్ స్థాయి పనితీరుకు ర్యాంకింగ్. ఇది గతంకంటే గణనీయమైన మెరుగుదలను సూచిస్తుంది. ఎందుకంటే Google AI 2024లో రజత పతకాన్ని మాత్రమే సాధించింది, ఈ ఏడాది Google జెమిని డీప్ థింక్ సహజ భాషలో ఎండ్-టు-ఎండ్ వరకు పనిచేసింది.
ఇప్పటికీ మానవ మేధస్సుదే పైచేయి..
మానవులు ఇప్పటికీ అత్యున్నత స్థాయిలో ఉన్నారు.AI అద్భుతమైన పనితీరు ఉన్నప్పటికీ ఐదుగురు మానవ టీనేజర్లు 42 పాయింట్ల ఫుల్ స్కోర్లను సాధించారు. మొత్తం 6 సమస్యలను పరిష్కరించారు. మానవ కంటెస్టెంట్లలో దాదాపు 10శాతం మంది గోల్డెన్ లెవెల్ స్కోర్లను సాధించి మానవ మేధస్సు ఇప్పటికీ AIని అధిగమించిందని నిరూపిస్తున్నాయి.
►ALSO READ | మైక్రోసాఫ్ట్ షేర్‌పాయింట్ హ్యాక్.. యూఎస్ న్యూక్లియర్ ఏజెన్సీపై చైనా అటాక్..
AI నమూనాల పరిష్కారాలు చాలా అంశాలలో ఆశ్చర్యకరంగా, స్పష్టంగా, ఖచ్చితమైనవిగా చాలా వరకు అనుసరించడానికి సులువుగా ఉన్నాయని IMO అధ్యక్షుడు గ్రెగర్ డోలినార్ చెప్పారు. AI దాని ఆలోచనా ప్రక్రియలను వివరించే సామర్థ్యంలో చాలా పురోగతిని సాధించాయని చెప్పుకొచ్చారు.
AI పనితీరు ప్రాముఖ్యత:
IMOలో AI మోడల్స్ గోల్డెన్ లెవెల్ స్కోర్లను సాధించడం కృత్రిమ మేధస్సులో ముఖ్యంగా అడ్వాన్స్ డ్ మేథమెటికల్ రీజనింగ్ లో ప్రధాన పురోగతి అని చెప్పొచ్చు. లోతైనలాజికల్ థింకింగ్ కు అవసరమయ్యే సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించే సామర్థ్యంలో AI వేగంగా అభివృద్ధిని ఇది సూచిస్తుంది. ఇది ఎంతోకాలంగా AIకి పెద్ద సవాలుగా ఉన్న అంశం. ఈ డెవలప్ మెంట్ భవిష్యత్తులో పరిష్కారం కాని పరిశోధన సమస్యలను పరిష్కరించడంలో AI ,గణిత శాస్త్రజ్ఞుల మధ్య సహకారానికి ఉపయోగపడుతుందని నిపుణులు విశ్వసిస్తున్నారు.