Gmail యూజర్లను టార్గెట్ చేస్తూ పెద్ద సైబర్ దాడి జరిగింది. దాదాపు 18 కోట్ల Gmail అకౌంట్స్ వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఇందులో ఇమెయిల్ అడ్రస్ సహా పాస్‌వర్డ్స్ రెండూ ఉన్నాయి. ఇవి హ్యాకర్లకు మీ Gmail, బ్యాంకింగ్, షాపింగ్, సోషల్ మీడియా వంటి ఇతర అకౌంట్స్ కి ఆక్సెస్ కూడా కల్పిస్తాయి. ఈ డేటా లీక్ ఏప్రిల్‌లో జరగ్గా, డేటా లీక్‌లను ట్రాక్ చేసే వెబ్‌సైట్ Have I Been Pwned తాగాజా ఈ విషయాన్నీ బయటపెట్టింది. ఈ Gmail డేటా లీక్ అనేది చాల వెబ్‌సైట్స్ నుండి దొంగిలించిన సేకరించిన పెద్ద హ్యాక్‌లో భాగమని సైబర్ నిపుణులు అంటున్నారు. హ్యావ్ ఐ బీన్ పవ్న్డ్ నడుపుతున్న ట్రాయ్ హంట్ మాట్లాడుతూ, Gmail డేటా చాల ఆన్‌లైన్ సోర్సెస్ నుండి సేకరించి బహిరంగంగా షేర్ చేసుకున్నట్లు చెప్పారు.
అయితే ఈ డేటా లీక్ తీవ్ర ఆందోళన కలిగిస్తుంది ఎందుకంటే ఇందులో Gmail IDలు, పాస్‌వర్డ్స్ రెండూ కూడా ఉన్నాయి. హ్యాకర్లు ఈ సమాచారాన్ని తీసుకున్న తర్వాత, మీరు అదే ఇమెయిల్ లేదా పాస్‌వర్డ్ ఉపయోగిస్తే మీ అకౌంట్స్ లోకి ఈజీగా ఆక్సెస్ పొందిచ్చు. అందుకే ఈ లీక్ ఇటీవల కాలంలో జరిగిన అతిపెద్ద వాటిలో ఒకటిగా పిలువబడుతోంది. హావ్ ఐ బీన్ పన్డ్ వెబ్‌సైట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 900 కంటే పైగా డేటా ఉల్లంఘనలు, లక్షకి పైగా హ్యాక్ చేసిన అకౌంట్స్ ట్రాక్ చేస్తుంది.
మీ Gmail అకౌంట్ కూడా హ్యాక్ అయిందని మీరు అనుకుంటే, వెంటనే మీ పాస్‌వర్డ్‌ను మార్చండి. మీ ఇతర అకౌంట్స్ కంటే స్ట్రాంగ్ పాస్‌వర్డ్ ఉపయోగించండి. అలాగే, మీ Gmail సెట్టింగ్‌లలో two-step verification (2FA)ని ఆన్ చేయండి. దీనివల్ల మరింత రక్షణ ఉంటుంది. హ్యాకర్ మీ పాస్‌వర్డ్ తెలుసుకున్న మీ ఫోన్‌కు లేదా మీరు వాడే డివైజ్ కి పంపిన కోడ్ లేకుండా లాగిన్ అవ్వలేరు. పాస్‌వర్డ్‌లను క్రమం తప్పకుండా అప్ డేట్ చేయడం లేదా మార్చడం వల్ల మీ Gmail, ఇతర ఆన్‌లైన్ అకౌంట్స్ సురక్షితంగా ఉండడంలో సహాయపడుతుంది.
