పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వస్తు్న చిత్రం ' స్పిరిట్ ' . ఈ మూవీ విడుదలకు ముందే ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఈ మూవీలో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న కొరియన్ సూపర్ స్టార్ డాన్ లీ.. ప్రతి నాయకుడి పాత్రలో ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం.. దీంతో ఇండియన్, కొరియన్ అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ భారీ కలయిక ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలవనుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
సంచలనం రేపుతున్న ప్రకాష్ రాజ్ డైలాగ్
అంతే కాదు ఇటీవల విడుదలైన ఆడియో టీజర్, ప్రభాస్ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచింది. ఈ గ్లింప్స్‌లో ప్రభాస్ పాత్ర భారతదేశంలోనే అతిపెద్ద స్టార్ అని వాయిస్ ఓవర్ ప్రకటించడం అభిమానులను ఉర్రూతలూగించింది. టీజర్‌లో ప్రభాస్ మరియు సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్లు వారి పాత్రల మధ్య గట్టి వైరాన్ని సూచిస్తున్నాయి. అయితే, ప్రకాష్ రాజ్ చెప్పిన ఒక బోల్డ్ డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది. జైలు సూపరింటెండెంట్ పాత్రలో ఉన్న ప్రకాష్ రాజ్, ప్రభాస్ పోషిస్తున్న ఖైదీ పాత్రను ఉద్దేశించి, ఖైదీని బట్టలూడదీసి టెస్టులకు పంపండి అని చెప్పడం ఆసక్తిని రెకెత్తించింది.
సందీప్ రెడ్డి వంగా... 'యానిమల్' చిత్రంతోనే బాలీవుడ్‌లో బోల్డ్ డైరెక్టర్ గా ముద్ర వేసుకున్నారు. అందులో రణ్‌బీర్ కపూర్ ఒక సన్నివేశంలో నగ్నంగా కనిపించారు. అదే పంథాను 'స్పిరిట్' విషయంలోనూ వంగా ఫాలో అవుతున్నట్లుగా ఈ డైలాగ్‌తో అర్థమవుతోంది. లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
బోల్డ్ గా ప్రభాస్ ?
తెలుగు సినీ వెబ్‌సైట్లలో , సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం, 'స్పిరిట్' చిత్రంలో ప్రభాస్ ఓ కీలక సన్నివేశంలో నగ్నంగా కనిపించనున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రకాష్ రాజ్ డైలాగ్ ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుతోంది. అయితే, ఈ బోల్డ్ సన్నివేశంలో ప్రభాస్ స్వయంగా నటిస్తారా, లేక బాడీ డబుల్ ఉపయోగిస్తారా, లేదా తెలివైన కెమెరా ట్రిక్స్ ద్వారా కేవలం సూచనప్రాయంగా చూపిస్తారా అనే దానిపై స్పష్టత లేదు. స్టార్ హీరోలతో ఇంతటి బోల్డ్ సన్నివేశాలు చేయించడం సందీప్ రెడ్డి వంగాకు మాత్రమే సాధ్యమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి, ఈ వార్తలపై చిత్ర బృందం నుండి లేదా ప్రభాస్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం లేదు.
త్రిప్తి డిమ్రీ ఎంట్రీ
కాగా, ఈ చిత్రంలో 'యానిమల్' ఫేమ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ హీరోయిన్‌గా నటించనుంది. ఈ మూవీ ద్వారా ఆమె టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్ కనిపించనున్న ఈ పాన్ ఇండియా మూవీ 2026లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు మాండరిన్, జపనీస్, కొరియన్ భాషల్లోనూ విడుదల కానుంది., తెలుగుతో పాటు పలు భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.
