మైక్రోసాఫ్ట్ షేర్‌పాయింట్ హ్యాక్.. యూఎస్ న్యూక్లియర్ ఏజెన్సీపై చైనా అటాక్..

మైక్రోసాఫ్ట్ షేర్‌పాయింట్ హ్యాక్.. యూఎస్ న్యూక్లియర్ ఏజెన్సీపై చైనా అటాక్..

రోజురోజుకూ సైబర్ దాడులు సామాన్యుల నుంచి అగ్రసంస్థలు, కంపెనీలనూ కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తాజాగా మైక్రోసాఫ్ట్ షేర్‌పాయింట్ సాఫ్ట్‌వేర్‌ లోపాలను ఉపయోగించి హ్యాకర్లు చేసిన దాడిలో ప్రపంచ వ్యాప్తంగా 100కు పైగా సంస్థలు ఎఫెక్ట్ అయ్యాయని తెలింది. ఇందులో అమెరికా నేషనల్ న్యూక్లియర్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ కూడా ప్రభావితం అయినట్లు వెల్లడైంది. 

ఈ సైబర్ దాడి చైనా స్పాన్సర్ చేసిన హ్యాకింగ్ గ్రూప్స్ పనేనని టెక్ దిగ్గజ మైక్రోసాఫ్ట్ ఆరోపిస్తోంది. మైక్రోసాఫ్ట్ చైనాతో అనుసంధానించబడిన మూడు- లినెన్ టైఫూన్, వైలెట్ టైఫూన్, స్టార్మ్-2603 - షేర్‌పాయింట్ సర్వర్‌లలోని కీలకమైన వల్నరబిలిటీలను ఉపయోగించుకుంటున్నట్లు గుర్తించింది. దీని వలన వినియోగదారులు తమ సొంత నెట్‌వర్క్‌లలో సాఫ్ట్‌వేర్‌ను నడుపుతున్నప్పుడు దాడికి గురయ్యే అవకాశం ఉంది. దాడి కారణంగా ప్రభుత్వ సంస్థలు, ఇంధన సంస్థలు, కన్సల్టింగ్ సంస్థలు, విశ్వవిద్యాలయాలు సహా అనేక రంగాల్లోని సంస్థలు ప్రభావితం అయ్యాయి. దీని ప్రభావం అమెరికా నుంచి యూరప్, మధ్యప్రాచ్యం వరకు విస్తరించిందని మైక్రోసాఫ్ట్ గుర్తించింది. 

►ALSO READ | H1B వీసా లాటరీ సిస్టం బంద్..! కొత్త విధానంతో భారతీయులకు కష్టకాలం..

ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్ స్ట్రైక్ ప్రకారం దాడి జూలై 7 నుంచే స్టార్ట్ అయినట్లు చెప్పింది. దీనిని అడ్డుకునేందుకు రంగంలోకి దిగిన మైక్రోసాఫ్ట్ కీలకమైన సెక్యూరిటీ ప్యాచ్ జూలై 8న అందించింది. అయితే హ్యాకర్లు వాటిని అధిగమించటానికి ఉన్న మార్గాలను వినియోగించి అక్రమంగా యాక్సెస్ పొందారని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. దీంతో నేరగాళ్లు యూజర్ నేమ్స్, పాస్ వర్డ్స్, అథెంటికేషన్ టోకెన్లను చోరీ చేశారు. దీని కారణంగా బ్రెజిల్, కెనడా, ఇండోనేషియా, స్పెయిన్, అమెరికాలోని సంస్థలు ఎక్కువగా ప్రభావితం అయ్యాయి. 

అయితే చైనాకు చెందిన హ్యాకర్లు చేసిన దాడిలో తమకు ఎలాంటి నష్టం జరగలేదని అమెరికా వెల్లడించింది. అలాంటి రహస్య సమాచారం లేదా కీలకమైన సమాచారం తస్కరణకు గురికాలేదని చెప్పింది. దాడి అణ్వాయుధాలను ఉత్పత్తి చేయడానికి, కూల్చివేయడానికి బాధ్యత వహించే సెమీ అటానమస్ ఎనర్జీ డిపార్ట్‌మెంట్ విభాగాన్ని టార్గెట్ చేసినట్లు US విద్యా శాఖతో సహా ఇతర సమాఖ్య సంస్థలతో పాటు లక్ష్యంగా చేసుకున్నట్లు తేలింది. అయితే మైక్రోసాఫ్ట్ చేసిన ఆరోపణలను వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం ఈ ఆరోపణలను ఖండించింది. ఆధారాలు లేకుండా తమను నిందించటం సరికాదని చైనా చెబుతోంది.