మొన్నటిదాకా పరుగు పెట్టిన బంగారం, వెండి ధరలు కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తున్నాయి.. గత తొమ్మిది రోజులుగా తగ్గుతూ వస్తున్న వెండి ఇవాళ ( అక్టోబర్ 24 ) కూడా భారీగా తగ్గింది. శుక్రవారం కిలో వెండి రూ. 3 వేలు తగ్గింది. ఈ క్రమంలో తొమ్మిది రోజుల్లో కిలో వెండి రూ. 36 వేలు తగ్గింది. పదిరోజుల క్రితం రూ. రెండు లక్షల మార్క్ దాటిన వెండి ఇవాళ మూడు వేలు తగ్గి రూ. లక్షా 71 వేలకు చేరింది. వెండి ధరలు వరుసగా తగ్గుతున్న క్రమంలో హర్షం వ్యక్తం చేస్తున్నారు జనం.
వివిధ మార్కెట్లలో వెండి ధరలు:
- హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ మార్కెట్లలో కిలో వెండి రూ. 3 వేలు తగ్గడంతో ప్రస్తుత ధర రూ. 1 లక్ష 71 వేలుగా ఉంది.
- వెండి ధర ఇలా..
- చెన్నై మార్కెట్లో కూడా కిలో వెండి రూ. 1 లక్ష 71 వేలుగా ఉంది.
- బెంగుళూరు, ముంబై, ఢిల్లీ నగరాల్లో కిలో వెండి రూ.1 లక్ష 56 వేలుగా ఉంది.
బంగారం ధరలు:
- తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం ధర స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 350 పెరిగి 10 గ్రాముల ధర రూ. 1 లక్ష 15 వేలకు చేరింది. 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 380 పెరిగి...10 గ్రాముల ధర 1 లక్ష 25 వేల 460కి చేరింది.
- ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ధర రూ. 1 లక్ష 15 వేల 150గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు గాను 1 లక్ష 25 వేల 610గా ఉంది.
- చెన్నై, బెంగుళూరు, ముంబై మార్కెట్లలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 1 లక్ష 15 వేలుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 1 లక్ష 25 వేల 460కి చేరింది.
