పరువు హత్య కేసు..ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురికి జీవిత ఖైదు

పరువు హత్య కేసు..ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురికి జీవిత ఖైదు

పరువు హత్య కేసులో కరీంనగర్ జిల్లా ప్రత్యేక ఫ్యామిలీ కోర్టు సంచలన తీర్పునిచ్చింది.  వీణవంక మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో 2019లో జరిగిన పరువు హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదుతో పాటు  ఒక్కొక్కరికీ రూ.1000  జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.  

గౌతమి అనే యువతి  ఆవునూరు శ్రీనివాస్ (31) ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వేరే కులస్తుడైన శ్రీనివాసుని గౌతమి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని  ఆమె కుటుంబ సభ్యులు శ్రీనివాస్ పై కక్ష కట్టారు. దీంతో   2019 జూన్ 19న రాత్రి శ్రీనివాస్ మోటారు సైకిల్ పై ఇంటికి వెళ్తుండగా రాళ్లతో దాడి చేసి చంపేశారు గౌతమి కుటుంబ సభ్యులు . తీవ్రగాయాల పాలైన శ్రీనివాస్ ను ఆసుపత్రికి  తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

 హత్యకు పాల్పడినట్లు అభియోగాలు నమోదైన వారిలో గౌతమి తండ్రి మండల ఓదేలు(48),  అన్న మండల సంపత్(28), తమ్ముడు మండల దేవేందర్(25),  తల్లి మండల లక్ష్మి(45)ని  దోషులుగా తేల్చింది కోర్టు.  కూతురు ప్రేమ పెళ్లి ఇష్టం లేక గౌతమి తల్లిదండ్రులు, అన్నాదమ్ముళ్లు కలిసి హత్య చేసినట్లు  ప్రాసిక్యూటర్  నిరూపించారు.  సరైన సాక్షాధారాలతో నిందితులే హంతకులని తేల్చడంతో శిక్ష ఖరారు చేసింది కోర్టు .