హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి బెంగుళూరు బయలుదేరిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు శుక్రవారం (అక్టోబర్ 24) తెల్లవారుజూమున చిన్నటేకూరు దగ్గర ప్రమాదానికి గురైంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును బైక్ ఢీకొనడంతో.. డిజిల్ ట్యాంక్‌కు మంటలు అంటుకుని బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో చనిపోయిన మృతుల పూర్తి వివరాలను ప్రభుత్వం వెల్లడించింది.
ఈ దుర్ఘటనలో మొత్తం 20 మంది చనిపోయినట్లు తెలిపింది. మృతుల్లో19 మంది బస్సులోని ప్రయాణికులు కాగా మరొకరు బైకర్. చనిపోయిన వారిలో 18 మంది వివరాలు గుర్తించిన ప్రభుత్వం.. ఒకరిని మాత్రం ఐడెంటిఫై చేయలేదు. మృతుల్లో తెలంగాణకు చెందిన వారు ఆరుగురు, ఏపీకి చెందిన వారు ఆరుగురు, కర్నాటకకు చెందిన వాళ్లు ఇద్దరు, బీహార్ చెందిన వారు ఒకరు, ఒడిషాకు చెందిన వారు ఒకరు, తమిళనాడుకు చెందిన వారు ఇద్దరు ఉన్నట్లు తెలిపింది. మృతుల వివరాల కోసం హెల్ప్ లైన్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలు:
1.ఫిలోమెన్ బేబీ (కర్నాటక)
2. కిషోర్ కుమార్ (కర్నాటక)
3. ప్రశాంత్ (తమిళనాడు)
4.అర్ఘ బంధోపాధ్యాయ (తెలంగాణ)
5.యువన్ శంకర్ రాజ్ (తమిళనాడు)
6.మేఘనాధ్ (తెలంగాణ)
7.అమృత్ కుమార్ (బీహార్)
8.జి ధాత్రి (ఆంధ్రప్రదేశ్)
9.చందన (తెలంగాణ)
10. సంధ్యా రాణి (తెలంగాణ)
11.అనూష (తెలంగాణ)
12.గిరి రావు (తెలంగాణ)
13.కెంగువా దీపక్ కుమార్ (ఒడిషా)
14.రమేష్ (ఆంధ్రప్రదేశ్)
15. అనూష (ఆంధ్రప్రదేశ్)
16. శశాంక్ (ఆంధ్రప్రదేశ్)
17. మావత (ఆంధ్రప్రదేశ్)
18.శ్రీనివాస్ రెడ్డి (ఆంధ్రప్రదేశ్)
19. గుర్తించ లేదు
20. బైకర్ (ఆంధ్రప్రదేశ్)
