దీపావళి పండుగ సందర్భంగా మధ్యప్రదేశ్‌లో కార్బైడ్ గన్స్ (పైప్ గన్స్ లేదా దేశీ ఫైర్‌క్రాకర్ గన్స్) వాడటంతో దాదాపు 300 మంది కంటిచూపు ప్రమాదాలకు గురయ్యారు. వీరిలో 14 మంది చిన్నారులు కంటిచూపు కోల్పోయారు. ఈ ఘటనల తర్వాత మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కార్బైడ్ గన్స్ తయారీ, అమ్మకాలు, కొనుగోళ్లు, నిల్వపై పూర్తి నిషేధం విధించింది.
మధ్యప్రదేశ్‌లోని భోపాల్ జిల్లాలో కార్బైడ్ తుపాకుల వాడకాన్ని నిషేధిస్తూ ఉత్తర్వు జారీ చేశారు. భోపాల్‌లో కార్బైడ్ తుపాకులతో ఆడుకున్న తర్వాత చాలా మంది పిల్లలు కంటికి గాయాలైన తర్వాత ఈ చర్య తీసుకుంది మధ్యప్రదేశ్ ప్రభుత్వం.
సీఎం మోహన్ యాదవ్, డిప్యూటీ సీఎం రాజేంద్ర శుక్లా ఆదేశాల మేరకు సబ్-డివిజనల్ మెజిస్ట్రేట్లు (SDMs), పోలీసులు, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్లు ఫైర్‌క్రాకర్ షాపులు, రోడ్‌సైడ్ స్టాల్స్‌లో రైడ్‌లు నిర్వహించాలని ఆదేశించారు. ఇనుము, స్టీలు, PVC పైప్‌లతో తయారు చేసిన అన్ని కార్బైడ్ గన్స్‌పై నిషేధం. భోపాల్‌లో 55 గన్స్ సీజ్ చేశారు.గ్వాలియర్‌లో యువకుడిని అరెస్ట్ చేశారు. వ్యాపారులు, తయారీదారులపై ఎక్స్‌ప్లోసివ్స్ యాక్ట్ కింద FIRలు నమోదు చేశారు.
కార్బైడ్ గన్స్ అంటే..
ఇవి PVC పైప్‌లు, ఇనుము లేదా స్టీలు గొట్టాలతో తయారు చేసిన స్వల్ప ఖర్చుతో (రూ. 150 నుంచి -200) అమ్మే టాయ్ గన్స్. కాల్షియం కార్బైడ్ (పండ్లు పండించే రసాయనం) ,నీటిని కలిపి అసిటిలీన్ గ్యాస్‌ను ఉత్పత్తి కావడంతో పేలుడు జరుగుతుంది. ఇది ఫైర్‌క్రాకర్ సౌండ్‌ను ఉత్పత్తి చేస్తాయి. కానీ పేలుడు వల్ల ప్లాస్టిక్ షార్డ్స్, రసాయనాలు కళ్ళు, ముఖం, చేతులపై పడి తీవ్ర ప్రమాదాలకు దారితీస్తాయి. పిల్లలు దగ్గరగా వాడటం వల్ల కార్నియల్ బర్న్స్, రెటినల్ డ్యామేజ్, శాశ్వతంగా కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
