మహిళల వరల్డ్ కప్ క్లైమాక్స్ కు చేరుకుంది. లీగ్ దశలో మరో నాలుగు మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ మ్యాచ్ లతో సంబంధం లేకుండా సెమీస్ కు చేరే జట్లేవో తెలిసిపోయాయి. ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్లు సెమీస్ కు అర్హత సాధించాయి. ఈ నాలుగు జట్లు తమ చివరి లీగ్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ లు ముగిశాక ఏ జట్టుతో ఏ జట్టు సెమీ ఫైనల్ ఆడుతుందో తెలుస్తుంది. భారత మహిళల జట్టు నాలుగో స్థానంలో ఉంటుంది కాబట్టి రెండో సెమీ ఫైనల్ ఆడుతుంది. చివరి మ్యాచ్ లో ఆదివారం (అక్టోబర్ 26) బంగ్లాదేశ్ తో తలపడాల్సి ఉంటుంది.
ఈ మ్యాచ్ లో మన మహిళల జట్టు గెలిచినా ఓడిపోయినా నాలుగో స్థానంలోనే ఉంటుంది. ఆస్ట్రేలియా (11) లేదా సౌతాఫ్రికా (10) జట్లకు మాత్రమే టేబుల్ టాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. శనివారం (అక్టోబర్ 25) ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లలో గెలిచిన జట్టు టేబుల్ టాపర్ అవుతుంది. ఇండియా సెమీస్ ఆస్ట్రేలియా లేదా సౌతాఫ్రికాతోనే ఆడాల్సి ఉంటుంది. మరోవైపు ఇంగ్లాండ్ తొలి సెమీస్ ఆడనుంది. ఇంగ్లాండ్ ప్రత్యర్థి కూడా సౌతాఫ్రికా లేదా ఆస్ట్రేలియా మ్యాచ్ తో తేలిపోతుంది. ఏదేమైనా రేపు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ రద్దు కాకుండా ఫలితం వస్తే సెమీ ఫైనల్ ప్రత్యర్థులపై క్లారిటీ వస్తుంది.
ALSO READ : అక్టోబర్ 30న ఇండియా సెమీ ఫైనల్ మ్యాచ్.. ప్రత్యర్థి ఎవరంటే..?
సెమీ ఫైనల్, ఫైనల్ షెడ్యూల్:
తొలి సెమీ ఫైనల్: అక్టోబర్ 29- బుధవారం- గౌహతి, బార్సపార క్రికెట్ స్టేడియం (మధ్యాహ్నం 3:00 గంటలకు)
రెండో సెమీ ఫైనల్: అక్టోబర్ 30- గురువారం- నవీ ముంబై, డివై పాటిల్ స్టేడియం (మధ్యాహ్నం 3:00 గంటలకు)
ఫైనల్ మ్యాచ్: వేదిక ఖరారు కాలేదు- నవంబర్ 2 (మధ్యాహ్నం 3:00 గంటలకు)
సెమీస్ కు చేరుకున్న నాలుగు జట్లు:
ఆస్ట్రేలియా (11)
సౌతాఫ్రికా (10)
ఇంగ్లాండ్ (9)
ఇండియా (8)
