Women's ODI World Cup 2025: అక్టోబర్ 30న ఇండియా సెమీ ఫైనల్ మ్యాచ్.. ప్రత్యర్థి ఎవరంటే..?

Women's ODI World Cup 2025: అక్టోబర్ 30న ఇండియా సెమీ ఫైనల్ మ్యాచ్.. ప్రత్యర్థి ఎవరంటే..?

సొంతగడ్డపై భారత మహిళల జట్టు ఎట్టకేలకు సెమీస్ కు చేరుకుంది. వరుసగా మూడు మ్యాచ్ లు ఓడిపోయినప్పటికీ న్యూజిలాండ్ పై గురువారం (అక్టోబర్ 23) కీలక విజయాన్ని అందుకొని సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో అక్టోబర్ 30న ఇండియా సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. మ్యాచ్ మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రాంభమవుతుంది. ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్లు సెమీస్ కు అర్హత సాధించాయి. టోర్నీలో మిగిలిన మ్యాచ్ లు నామమాత్రం కానున్నాయి. ఇండియా విషయానికి వస్తే చివరి మ్యాచ్ లో ఆదివారం (అక్టోబర్ 26) బంగ్లాదేశ్ తో తలపడాల్సి ఉంటుంది.

టోర్నీ షెడ్యూల్ ప్రకారం నాలుగో స్థానంలో నిలిచిన జట్టు టేబుల్ టాపర్ తో ఆడాల్సి ఉంటుంది. ఇండియా నాలుగో స్థానంలోనే  ఉంటుంది కాబట్టి టేబుల్ టాపర్ ఎవరు అవుతారనే ఆసక్తి ఇప్పుడు నెలకొంది. 9పాయింట్లతో ఉన్న ఇంగ్లాండ్ జట్టు అగ్రస్థానానికి  చేరుకునే ఛాన్స్ లేదు. ఆ జట్టు చివరి మ్యాచ్ లో గెలిచినా ఓడిపోయినా రెండు లేదా మూడు స్థానాల్లోనే ఉంటుంది. ఆస్ట్రేలియా (11) లేదా సౌతాఫ్రికా (10) జట్లకు మాత్రమే టేబుల్ టాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. శనివారం (అక్టోబర్ 25) ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లలో గెలిచిన జట్టు టేబుల్ టాపర్ అవుతుంది. ఇండియా సెమీస్ ఆస్ట్రేలియా లేదా సౌతాఫ్రికాతోనే ఆడాల్సి ఉంటుంది. 

ALSO READ : స్మృతి క్రీడాస్ఫూర్తి: ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును రావల్‌కు షేర్ చేసిన మందాన

ప్రస్తుతం ఉన్న ఫామ్ ప్రకారం సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీని ప్రకారం భారత మహిళల జట్టు ఆస్ట్రేలియాతోనే ఆడే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇండియా తమ సెమీ ఫైనల్ మ్యాచ్ ను అక్టోబర్ 30న ఆడాల్సి ఉంది. ఇది టోర్నమెంట్ రెండో సెమీ ఫైనల్. తొలి సెమీ ఫైనల్ టాప్ రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య జరుగుతుంది. ఏదేమైనా ఇండియా సెమీ ఫైనల్ ప్రత్యర్థి ఎవరనేది రేపు తెలుస్తోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా (11), సౌతాఫ్రికా (10), ఇంగ్లాండ్ (9), ఇండియా (8) టాప్-4 లో ఉన్నాయి. ఈ నాలుగు జట్లు తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడాల్సి ఉంది.