Women's ODI World Cup 2025: స్మృతి క్రీడాస్ఫూర్తి: ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును రావల్‌కు షేర్ చేసిన మందాన

Women's ODI World Cup 2025: స్మృతి క్రీడాస్ఫూర్తి: ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును రావల్‌కు షేర్ చేసిన మందాన

మహిళల వరల్డ్ కప్ లో టీమిండియా సెమీస్ కు దూసుకెళ్లింది. గురువారం (అక్టోబర్ 23) న్యూజిలాండ్ పై ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో విజయం సాధించి సెమీస్ సమరానికి అర్హత సాధించింది. ఓపెనర్లు స్మృతి మంధాన (95 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 10 ఫోర్లు, 4 సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో 109), ప్రతీకా రావల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (134 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 13 ఫోర్లు, 2 సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో 122) సెంచరీలతో దుమ్మురేపడంతో.. గురువారం (అక్టోబర్ 23) జరిగిన లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా 53 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (డక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లూయిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) తేడాతో న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై గెలిచింది. ఈ మ్యాచ్ లో సూపర్ సెంచరీ చేయడంతో పాటు ఒక స్టన్నింగ్ క్యాచ్ అందుకున్న మంధానకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. 

ప్రెజెంటేషన్ సమయంలో స్మృతి తన క్రీడాస్ఫూర్తితో అందరి మనసులను గెలుచుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ను తన సహచర  ప్లేయర్ ప్రతీక రావల్ కు షేర్ చేసింది. టీమిండియా ఓపెనర్ తీసుకున్న ఈ నిర్ణయంతో సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ మ్యాచ్ లో మందనతో పాటు రావల్ సెంచరీతో అదరగొట్టింది. తొలి వికెట్ కు వీరిద్దరి జోడీ ఏకంగా 212 పరుగులు జోడించి జట్టుకు భారీ స్కోర్ అందించారు. రావల్ 122 పరుగులు చేస్తే స్మృతి 109 పరుగులు చేసింది. ఎక్కువ స్ట్రైక్ రేట్ కారణంగా స్మృతి మందనాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. 

ALSO READ : మ్యాక్స్ వెల్‌కు చోటు.. ఇండియాతో టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా స్క్వాడ్‌లో కీలక మార్పులు

ఈ మ్యాచ్ విషయానికి వస్తే వర్షం వల్ల ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 49 ఓవర్లకు కుదించారు. టాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓడిన ఇండియా ఓవర్లన్నీ ఆడి 3 వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. జెమీమా రొడ్రిగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (55 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 11 ఫోర్లతో 76 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) చెలరేగింది. తర్వాత న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 44 ఓవర్లలో 325 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిర్దేశించారు. దీన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 271/8 స్కోరుకే పరిమితమైంది. బ్రూక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాలీడే (84 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 9 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో 81) టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. ఇసాబెల్లా గాజె (51 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 10 ఫోర్లతో 65 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) పోరాడి విఫలమైంది. రేణుకా సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, క్రాంతి గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెరో రెండు వికెట్లు తీశారు. మంధానకు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది.