IND vs AUS: మ్యాక్స్ వెల్‌కు చోటు.. ఇండియాతో టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా స్క్వాడ్‌లో కీలక మార్పులు

IND vs AUS: మ్యాక్స్ వెల్‌కు చోటు.. ఇండియాతో టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా స్క్వాడ్‌లో కీలక మార్పులు

ఇండియాతో వన్డే సిరీస్ తర్వాత జరగబోయే ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ కు ఆస్ట్రేలియా జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. శుక్రవారం (అక్టోబర్ 24) క్రికెట్ ఆస్ట్రేలియా నలుగురు కొత్త ప్లేయర్లను స్క్వాడ్ లోకి చేర్చుకుంది. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న మ్యాక్స్ వెల్ ఆసీస్ జట్టులోకి చాలా నెలల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ విధ్వంసక వీరుడు చివరి మూడు మ్యాచ్ లకు మాత్రమే అందుబాటులో ఉంటాడు. మ్యాక్స్ వెల్ తో పాటుఫాస్ట్ బౌలర్ బెన్ డ్వార్షుయిస్ (నాలుగు, ఐదు మ్యాచ్ లకు).. వికెట్ కీపర్ జోష్ ఫిలిప్ (అన్ని గేమ్‌లు), యువ పేసర్ మహ్లి బియర్డ్‌మాన్ (మూడు, నాలుగు, ఐదు) స్క్వాడ్ లో ఎంపికయ్యారు.             

స్టార్ ఫాస్ట్ బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ తొలి రెండు టీ20 మ్యాచ్ లు మాత్రమే ఆడనున్నాడు. సీన్ అబాట్ మొదటి మూడు మ్యాచ్ లకు మాత్రమే అందుబాటులో ఉంటాడు. మ్యాక్స్ వెల్ జట్టులోకి రావడంతో ఆసీస్ జట్టు మరింత పటిష్టంగా మారింది. ఇటీవలే న్యూజిలాండ్‌లో టీ20 సిరీస్ కు ముందు నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్నప్పుడు మ్యాక్స్ వెల్ కు గాయమైంది. మణికట్టు గాయం నుండి కోలుకున్న తర్వాత మాక్స్‌వెల్ ఫిట్‌గా ఉన్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్ ప్రకటించింది. ఇండియాపై మ్యాక్సీకి అద్భుతమైన రికార్డ్ ఉంది.    ఇండియాపై ఓవరాల్ గా 22 టీ20 మ్యాచ్ ల్లో 31.89 యావరేజ్.. 52.25 స్ట్రైక్ రేట్‌తో 574 పరుగులు చేశాడు. 

టీ20 తో పాటు ఇండియాతో సిడ్నీ వేదికగా జరగబోయే చివరి వన్డేలో మార్పులు చోటు చేసుకున్నాయి. మార్నస్ లాబుస్చాగ్నేను వన్డే జట్టు నుంచి రిలీజ్ చేశారు. ఆస్ట్రేలియా ఎలాగో వన్డే సిరీస్ గెలవడంతో ఈ స్టార్ ప్లేయర్ ను ఆస్ట్రేలియా యాషెస్ కు సిద్ధం చేసే పనిలో ఉంది. జాక్ ఎడ్వర్డ్స్, మాట్ కుహ్నెమాన్ సిడ్నీలో జరిగే చివరి వన్డే స్క్వాడ్ లో చోటు సంపాదించారు. మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా చివరి వన్డే శనివారం (అక్టోబర్ 25) సిడ్నీ వేదికగా జరుగుతుంది.   


ఇండియాతో టీ20 సిరీస్ కు ఆస్ట్రేలియా స్క్వాడ్:

మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్ (ఆటలు 1–3), జేవియర్ బార్ట్‌లెట్, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్ (ఆటలు 4–5), నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్ (ఆటలు 1–2), మహ్లి బియర్డ్‌మాన్ (ఆటలు 3–5), ట్రావిస్ హెడ్, జోష్ ఫిలిప్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, మిచెల్ ఓవెన్, మాట్ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.

5 మ్యాచ్ ల సిరీస్ షెడ్యూల్:

అక్టోబర్ 29: మొదటి టీ20 - మనుకా ఓవల్, కాన్‌బెర్రా
అక్టోబర్ 31: రెండవ టీ20  - MCG, మెల్బోర్న్
నవంబర్ 2: 3వ టీ20  - బెల్లెరివ్ ఓవల్, హోబర్ట్
నవంబర్ 6: 4వ టీ20  - గోల్డ్ కోస్ట్ స్టేడియం
నవంబర్ 8: 5వ టీ20 - ది గబ్బా, బ్రిస్బేన్