Ravi Shastri: కోహ్లీకే అగ్రస్థానం.. టాప్-5 ఆల్ టైమ్ ఇండియన్ బెస్ట్ ప్లేయర్స్ ఎవరో చెప్పిన రవిశాస్త్రి

Ravi Shastri: కోహ్లీకే అగ్రస్థానం.. టాప్-5 ఆల్ టైమ్ ఇండియన్ బెస్ట్ ప్లేయర్స్ ఎవరో చెప్పిన రవిశాస్త్రి

టీమిండియా మాజీ క్రికెటర్.. మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి.. తన ఫేవరేట్ ప్లేయర్ కోహ్లీపై ఇష్టాన్ని మరోసారి చాటుకున్నాడు. ఇండియన్ క్రికెట్ లో బెస్ట్ ప్లేయర్ గా కోహ్లీని ఎంచుకున్నాడు. టాప్-5 ఇండియా ఆల్ టైమ్ బెస్ట్ ప్లేయర్ ను ఎంచుకోమని అడిగినప్పుడు కోహ్లీకి అగ్రస్థానాన్ని కట్టబెట్టాడు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ను రెండో స్థానంలో ఉంచాడు. మాజీ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్స్ కపిల్ దేవ్, ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ లను వరుసగా మూడు, నాలుగు, ఐదు ర్యాంక్ లు ఇచ్చాడు. ఈ జాబితాలో గంగూలీ, ద్రవిడ్, జస్ప్రీత్ బుమ్రా, సునీల్ గవాస్కర్, అనీల్ కుంబ్లే లను శాస్త్రి పక్కన పెట్టాడు. 

శాస్త్రి మాట్లాడుతూ.. "నేను కోహ్లీ, టెండూల్కర్, కపిల్ దేవ్, ఎంఎస్ ధోని, రోహిత్ శర్మలను ఎంపిక చేస్తాను. మీరు గమనించినట్లయితే వీరందరూ 15 సంవత్సరాలుగా క్రికెట్ లో కొనసాగారు. అందుకే నేను వీరిని ఎంచుకున్నాను. టాప్-5 ను ఎంచుకోవడం కష్టం. మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా మంది మంచి ఆటగాళ్లు కనిపిస్తారు. కానీ నాకు మాత్రం వీరు ప్రత్యేకంగా నిలుస్తారు. వీరిలో రోహిత్ శర్మ తప్ప మిగిలిన నలుగురు ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యులే. కానీ రోహిత్‌ను మూడు డబుల్ సెంచరీలతో పాటు వన్డేల్లో 11,000 పరుగులకు పైగా పరుగులు చేశాడు". అని శాస్త్రి ఫాక్స్ క్రికెట్‌తో మాట్లాడుతూ అన్నాడు. 

"నేను బుమ్రాను ఈ జాబితాలో చేర్చకపోవడానికి కారణం అతనికి ఇంకా మూడు లేదా నాలుగు సంవత్సరాల క్రికెట్ మిగిలి ఉంది. నేను ఎంపిక చేసిన ఆటగాళ్లు కొంతమంది రిటైర్మెంట్ ప్రకటించగా మరికొందరు దాదాపు వారి కెరీర్ చివరి దశకు చేరుకుంటున్నారు. వీరిలో రోహిత్ తప్పితే మిగిలిన వారు వన్డే వరల్డ్ కప్ గెలిచారు. వీరందరూ తమదైన రోజున మ్యాచ్  ను ఒంటిచేత్తో గెలిపించగలరు". అని శాస్త్రి అన్నారు. ప్రస్తుతం రవిశాస్త్రి ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ఇండియా, ఆస్ట్రేలియా వన్డే సిరీస్ కు కామెంట్రీ చేస్తూ బిజీగా ఉన్నాడు. భారత క్రికెట్ లో గొప్ప బ్యాటర్ గా రవి శాస్త్రికి పేరుంది. 1983 ఇండియా వరల్డ్ కప్ గెలిచిన జట్టులో జట్టులో సభ్యుడు.