H1B వీసా లాటరీ సిస్టం బంద్..! కొత్త విధానంతో భారతీయులకు కష్టకాలం..

H1B వీసా లాటరీ సిస్టం బంద్..! కొత్త విధానంతో భారతీయులకు కష్టకాలం..

US Visa: అమెరికాలో ఉద్యోగం చేయాలంటే హెచ్1బి వీసా తప్పనిసరి. సాధారణంగా కంపెనీలు తమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగుల రిక్రూర్ట్మెంట్ కోసం ఈ తరహా వీసాలకు యూఎస్ లోని సంస్థలు స్పాన్సర్ చేస్తుంటాయి. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీసాలకు సంబంధించిన నిబంధనలు మరింత కఠినతరంగా మారిపోయాయి. 

ప్రస్తుతం అమెరికాలోని డోనాల్డ్ ట్రంప్ పరిపాలన H-1B వీసాలను జారీ చేయడానికి ప్రస్తుతం అవలంబిస్తున్న లాటరీ ప్రక్రియకి బదులుగా.. కొత్త వెయిటెడ్ (పాయింట్ల ఆధారిత) ఎంపిక వ్యవస్థను తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ తీసుకొచ్చిన ఈ ప్రతిపాధన ప్రకారం.. 85వేల H-1B వీసా సీట్లకు దరఖాస్తుదారులను వారి అర్హతలతో పాటు జీతం ఆధారంగా ఎంపిక చేస్తారు. కొత్త విధానం కింద అధిక నైపుణ్యం కలిగిన అలాగే ఎక్కువ జీతాలు కలిగిన దరఖాస్తుదారులకు మాత్రమే ప్రాధాన్యత లభించనుంది. 

ALSO READ : Income Tax: జూలై 23 టాక్స్ రూల్ గుర్తుందా..? మర్చిపోతే ఎక్కువ టాక్స్ కడతారు!

వాస్తవానికి చాలా కాలంగా హెచ్1బి వీసాల అతిపెద్ద లబ్ధిదారులుగా భారతీయులే ఉన్నారు. అందువల్ల కొత్తగా యూఎస్ తీసుకురావాలనుకుంటున్న వీసా వ్యవస్థ నేరుగా భారతీయ నిపుణులను ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీని ద్వారా తక్కువ అనుభవం కలిగిన నిపుణులు.. అలాగే చిన్న కంపెనీల నుంచి హెచ్1బి వీసాల కోసం డిమాండ్ తగ్గుతుంది. పైగా ఫ్రెషర్లు, తక్కువ జీతానికైనా యూఎస్ వెళ్లి పనిచేయాలనుకునే ఆశావహులకు నిరాశ మిగలనుంది.