మొంథా ఎఫెక్ట్: ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు రేపు (అక్టోబర్ 30) సెలవు

మొంథా ఎఫెక్ట్: ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు రేపు (అక్టోబర్ 30) సెలవు

మొంథా తుఫాను తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తోంది. తుఫాను ధాటికి తెలంగాణ జిల్లాల్లో పలు ప్రాంతాలు స్తంభించిపోయాయి. భారీ వర్షాలతో చెరువులు, కుంటలు తెగిపోవడంతో.. కొన్ని జిల్లాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.  వర్షాలు దంచికొడుతుండటంతో సిద్ధిపేట, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగాం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న క్రమంలో రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. భారీ వర్షాల పట్ల జనం అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది వాతావరణ శాఖ. 

అదే విధంగా భారీ వర్షాలు దృష్టిలో ఉంచుకుని గురువారం (అక్టోబర్ 30) సిద్ధిపేట, హన్మకొండ ములుగు జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో ఇళ్లలో నుంచి అవసరం ఉంటే తప్ప ప్రజలు బయటకు రావొద్దని అధికారుల సూచించారు. సహాయక చర్యల కోసం NDRF, SDRF బృందాలు రంగంలోకి దిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. 

►ALSO REA D | మొంథా ఎఫెక్ట్.. హైదరాబాద్-శ్రీశైలం హైవేపై రాకపోకలు బంద్.. ఈ రూట్లలో వెళ్తే సేఫ్

మరోవైపు తుఫాను ప్రభావంతో ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న క్రమంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.

అలాగే కొమరం భీం ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న క్రమంలో ఎల్లో  అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.