ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కంపెనీ Open AI కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ పునర్మిర్మాణం ద్వారా క్యాపిటల్ సేకరించేందుకు సిద్దమయింది. ఈ మార్పు 2019లో మైక్రోసాఫ్ట్ తో చేసుకున్న ఒప్పందాల లిమిట్స్ ను తొలగిస్తుంది. అయితే OpenAI సీఈవో, కోఫౌండర్ సామ్ ఆల్ట్ మన్ కు కొత్త పునర్నిర్మిత సంస్థలో ఎటువంటి ఈక్విటీ స్టేక్ లభించదని అధికారికంగా ప్రకటించింది. గతేడాది కంపెనీ ఆయనకు వాటా ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ ఇప్పుడు రద్దు చేసింది. ఆల్ట్‌మన్ మిషన్ పోకస్ట్ లీడర్ గా ఉంటారని తెలిపింది.
మైక్రోసాఫ్ట్ స్టేక్.. OpenAI ఆజూర్ క్లౌడ్ సర్వీసెస్‌కు మైక్రోసాప్ట్250 బిలియన్ల డాలర్ల కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం 2032 వరకు కొనసాగుతుంది. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI) చేరుకున్నప్పటికీ మైక్రోసాఫ్ట్‌కు కొన్ని హక్కులు ఉంటాయని ప్రకటించింది.
నాన్-ప్రాఫిట్ ఫౌండేషన్: OpenAI ఫౌండేషన్‌కు 26శాతం స్టేక్ ( 130 బిలియన్ల డాలర్లు) లభిస్తుంది. ఈ నిధులు ఆరోగ్య పరిశోధన, AI సేఫ్టీ ,ఫిలాన్థ్రాపిక్ పనులకు ఉపయోగిస్తారు.
IPO ప్లాన్స్ లేవు: సంస్థ విలువ 500 బిలియన్ల డాలర్లుగా అంచనా వేస్తోంది. OpenAI IPO (ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్) చేయాలని ఎటువంటి ప్రణాళికలు లేవని స్పష్టం చేసింది.
ఈ పునర్నిర్మాణం OpenAIకి AI అభివృద్ధికి మరింత ఫండింగ్ సామర్థ్యం ఇస్తుంది. ChatGPT 700 మిలియన్ వీక్లీ యూజర్లకు మద్దతు ఇస్తుంది. అయితే ఆల్ట్‌మన్ లేకపోవడం ఇన్వెస్టర్లు ,టాలెంట్ రిటెన్షన్‌కు సవాలుగా మారవచ్చు. గతంలో ఎలాన్ మస్క్ దాఖలు చేసిన లాసూట్ వంటి రెగ్యులేటరీ సవాళ్లు కూడా ఉన్నాయి.
