పిల్లల కోసం ఆలోచిస్తున్న.. ఇప్పటినుంచే ఫిట్గా ఉండాలనుకుంటున్న: ట్రెండింగ్లో రష్మిక కామెంట్స్

పిల్లల కోసం ఆలోచిస్తున్న.. ఇప్పటినుంచే ఫిట్గా ఉండాలనుకుంటున్న: ట్రెండింగ్లో రష్మిక కామెంట్స్

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల నిశ్చితార్థం జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో బ్యూటీ రష్మిక ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చాయి. ఇందులో రష్మిక పిల్లల గురించి ఆలోచిస్తున్నట్టు చెప్పడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే తన ఎంగేజ్ మెంట్ జరిగినట్టు, ఇప్పటివరకు ఎక్కడా బయటపెట్టలేదు. కానీ, ఏదోరకంగా హింట్ ఇస్తూనే వస్తుంది.

లేటెస్ట్గా ది గర్ల్ ఫ్రెండ్ ప్రమోషన్స్లో భాగంగా.. రష్మిక పిల్లల విషయంలో మాట్లాడుతూ.. “నేను ఇంకా తల్లిని కాలేదు. కానీ నాకు పిల్లలు పుడతారని తెలుసు. వారి కోసం నేను ఇప్పటినుంచే ఆలోచిస్తున్నా. సురక్షితంగా ఉండాలని, వాళ్లకు మంచి జీవితం ఇవ్వాలని కోరుకుంటున్నాను. వారి కోసం నేను ఏదైనా చేయడానికి ఫిట్గా ఉండాలనుకుంటున్న. అందుకే పనిగంటల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకున్నా.

ఓవర్ వర్క్ చేయడం గొప్ప విషయం కాదు. ఇప్పటి నుంచి ఫిక్స్డ్ టైమింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. మిగతా టైమ్ ఫ్యామిలీతో, హెల్త్కి కేటాయించాలనుకుంటున్నాను. అలాగే ఫిట్గా ఉండేందుకు వర్కౌట్ చేయాలనుకుంటున్నాను. ఇలా చేస్తే భవిష్యత్తులో పశ్చాత్తాప పడాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నా’’ అని చెప్పు కొచ్చింది రష్మిక. 

దీపికా పడుకొనే, రష్మిక:

ఆఫీసుల్లో 9 టు 5 టైమింగ్స్ ఉన్నట్లుగా, మాకూ ఆ షెడ్యూల్ ఉండాలి. ఎందుకంటే నాకు ఇంకా కుటుంబ జీవితం ఉంది, దానిపై దృష్టి పెట్టాలి. నా నిద్ర, వర్కవుట్‌లకు కూడా సమయం కావాలి. అప్పుడే భవిష్యత్తులో నేను బాధపడకుండా ఉంటాను. నేను ఇప్పటికీ నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. కానీ తనకు 'నో' చెప్పడం రాకపోవడం వల్లే తాను చేయగలిగిన దానికంటే ఎక్కువ ప్రాజెక్ట్‌లు తీసుకుంటున్నానని రష్మిక తెలిపింది.

►ALSO READ | Vijay Rashmika Engagement: ‘అంతే అంతే.. అందరికీ తెలుసే’..

ముఖ్యంగా పెళ్లి తర్వాత ఫ్యామిలీ లైఫ్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్న తరుణంలో షెడ్యూల్డ్ వర్క్ అవర్స్ అవసరమని బలంగా కోరింది. నాకు అవకాశం ఉంటే, దయచేసి మాలాంటి నటీనటులతో అంత ఎక్కువగా పనిచేయించవద్దు అని అడుగుతాను అని చెప్పింది. అని రష్మిక ఎమోషనల్ అయ్యింది.

ఇటీవల దీపికా పడుకొనే 8 గంటల షిఫ్ట్‌లు డిమాండ్ చేసింది. దీంతో రెండు పెద్ద తెలుగు ప్రాజెక్ట్‌ల నుంచి తప్పుకున్నారు. ఈ వార్తల నేపథ్యంలో రష్మిక చేసిన ఈ వ్యాఖ్యలు.. ఇండస్ట్రీలో నటీనటులు ఎదుర్కొంటున్న ఒత్తిడిని, పని-జీవిత సమతుల్యత ఆవశ్యకతను మరోసారి చర్చనీయాంశంగా మారాయి. 

ది గర్ల్ ఫ్రెండ్ మూవీ గురించి:

రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా రూపొందిన చిత్రం ‘ది గర్ల్‌‌ ఫ్రెండ్‌‌’. నటుడు రాహుల్‌‌ రవీంద్రన్‌‌ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు. యూత్‌‌‌‌‌‌‌‌ ఫుల్‌‌‌‌ రొమాంటిక్‌‌ లవ్‌‌‌‌‌‌‌ స్టోరీగా తెరకెక్కిన గర్ల్ ఫ్రెండ్.. టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచాయి. హేషమ్ అబ్దుల్ వాహబ్ ఇచ్చిన ఫీల్ గుడ్ మ్యూజిక్ సినిమాకు ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది. నవంబర్ 7న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇకపోతే, వరుస చిత్రాలతో బిజీగా ఉన్న రష్మిక మరో హిట్ను తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధంగా ఉంది. మరి ది గర్ల్ ఫ్రెండ్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.