నేషనల్ క్రష్ రష్మిక మందన్న, హీరో విజయ్ దేవరకొండల పెళ్లి వార్తలు మరింత ఊపందుకున్నాయి. ఇటీవలే ఈ జంటకు నిశ్చితార్థం జరిగినట్లు, త్వరలో పెళ్లితో ఒక్కటవ్వనున్నట్లు టాక్ బలంగా వినిపిస్తోంది. ఇందుకు కారణం.. లేటెస్ట్గా రష్మిక ఇచ్చిన ఇన్ డైరెక్ట్ హింట్స్.. ఇపుడు ఈ చర్చకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..
‘థామా’ మూవీ ప్రమోషనల్ ఈవెంట్లో, నిశ్చితార్థం గురించి అడిగినప్పుడు రష్మిక నవ్వుతూ, ‘‘అందరికీ దాని గురించి తెలుసు’’ అని చెప్పింది. ఇది మాత్రమే కాకుండా.. లేటెస్ట్గా ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ట్రైలర్ లాంచ్ సమయంలో కూడా, నిర్మాత అల్లు అరవింద్.. రష్మిక మందన్నను ఆటపట్టిస్తూ.. ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు విజయ్ దేవరకొండ వస్తాడని జోక్ చేశాడు. ఇక అక్కడున్న ఆడియన్స్ కేరింతలు కొడుతుండగా, రష్మిక కూడా తనదైన నవ్వుతో ఇన్ డైరెక్ట్ సిగ్నల్ ఇచ్చింది.
అలాగే, ఇదే ఈవెంట్‌లో ఒక వ్యక్తిని బాయ్‌ఫ్రెండ్‌గా సెలెక్ట్ చేసుకోవాలంటే.. ఎలా జడ్జ్ చేయాలని రష్మికను యాంకర్ అడుగుతుంది. ఆ సమయంలో ఆడియన్స్ నుంచి..‘విజయ్ దేవరకొండను అడిగితే చెప్తారని సమాధానం’ వస్తుంది. అప్పుడు రష్మిక కూడా సిగ్గుపడుతూ.. స్మైల్ ఇస్తుంది. ఇందులో భాగంగానే.. రష్మిక ఎలాంటి అబ్బాయిని ఇష్టపడుతుంది? అని యాంకర్ మరో ప్రశ్న వేయగానే మళ్లీ ఆడియన్స్ నుంచి రౌడీ (విజయ్ దేవరకొండ) లాంటి వ్యక్తినే అంటూ అరుపులు వినిపిస్తాయి.
ఇక ఆ సమయంలో రష్మిక ఇచ్చిన స్మైల్, చెప్పిన క్యూట్ ఆన్సర్.. వీరి మధ్య ఉన్న రూమర్స్కు మరింత బలాన్ని చేకూర్చింది. ‘‘రష్మిక చిరునవ్వుతో.. అందరికీ తెలుసే..’’ అని చేతులతో అవుననే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ 'అంతే అంతే'.. ఇచ్చేసింది. అలాగే, ది గర్ల్ ఫ్రెండ్ ప్రమోషన్స్ లోనే.. ఆడియన్స్ రష్మికను అడుగుతూ..‘సోషల్ మీడియాలో మేం చూస్తున్నది, వింటున్నది.. నిజంగా నమ్మొచ్చా? ఇది నిజమా? అబద్దమా? చెప్పండి మేడం’ అని అడిగారు. ‘ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెబుతా.. మీకేం అనిపిస్తుందో అదే’ అని క్యూట్ రిప్లై ఇచ్చింది.
ఈ క్రమంలోనే వీరి ఎంగేజ్మెంట్ న్యూస్ మరోసారి వైరల్ అవుతుంది. అయితే, సినీ వర్గాల సమాచారం ప్రకారం.. అతి త్వరలోనే ఈ జంట తమ అభిమానులందరికీ శుభవార్త చెప్పే అవకాశం ఉందంటున్నారు. చూడాలి మరి ఏమవుతుందో!
విజయ్-రష్మికల ఎంగేజ్‌మెంట్ ఉంగరాల టాక్:
ఇటీవల (2025 అక్టోబర్ 3న)విజయ్-రష్మికల నిశ్చితార్థం జరిగిందని టాలీవుడ్ వర్గాల్లో బలంగా వినిపించింది. అయితే, ఈ జంట మాత్రం ఇన్ డైరెక్ట్ హింట్స్ ఇస్తున్నారే తప్ప, తమ పెళ్లిపై ఎటువంటి క్లారిటీ ఇవ్వట్లేదు. ఈ తరుణంలోనే విజయ్-రష్మిక మూడు ముళ్లతో ఒక్కటవ్వనున్నారు, అనడానికి పలు సాక్ష్యాలు ఇపుడు వైరల్గా మారాయి. అవే తమ ఇరువురు చేతికి ఉన్న ఉంగరాలు.
అలాగే, ఇటీవలే విజయ్ దేవరకొండ పుట్టపర్తి వెళ్లారు. అక్కడ ఆయన విజయ్ చేతికి కొత్తగా కనిపించిన బంగారపు రింగ్ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేసింది. ఈ క్రమంలోనే లేటెస్ట్గా రష్మిక ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇందులో తన ప్రసెంట్ బాలీవుడ్ మూవీ ‘థామా’లోని ‘నువ్వు నా సొంతమా’ సాంగ్ అప్డేట్ ఇచ్చింది. అయితే, ఇక్కడ రష్మిక చేతికి వజ్రపు ఉంగరం కనిపించి నెటిజన్లకు దొరికిపోయింది.
ఈ క్రమంలోనే ‘విజయ్- రష్మిక ఎంగేజ్‌మెంట్ జరిగిపోయింది. వీరి పెళ్లి కన్ఫామ్’ అంటూ సోషల్ మీడియాలో తమ ఫ్యాన్స్తో పాటు నెటిజన్లు కూడా కామెంట్స్ చేశారు. ప్రస్తుతం విజయ్ వేలికి మెరుస్తున్న రింగ్, రష్మిక ఎడమ చేతికి ఉన్న రింగ్ ఫొటోస్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతానికి విజయ్, రష్మిక లేదా వారి కుటుంబ సభ్యులు ఈ నిశ్చితార్థం గురించి అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.
నాలుగేళ్ల రహస్య ప్రేమాయణం:
విజయ్ దేవరకొండ, రష్మిక తొలిసారిగా 'గీత గోవిందం' (2018) సినిమాలో జంటగా నటించారు. ఆ తర్వాత 'డియర్ కామ్రేడ్' (2019)లో నటించారు. ఈ రెండు సినిమాల్లో వారి కెమిస్ట్రీ అద్భుతంగా పండడంతో, తెరపైనే కాదు, నిజ జీవితంలోనూ వీరి మధ్య ఏదో ఉందని సినీ విశ్లేషకులకులతో పాటు అభిమానుల్లో ఒక అంచనాకు వచ్చారు.
ప్రస్తుతం ఈ జంట ట్యాక్సీవాలా' డైరెక్టర్ రాహుల్ సంక్రిత్యాన్.. విజయ్తో మరో మూవీ చేస్తున్నారు. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇందులో విజయ్ కి జోడీగా రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. 1870 టైమ్‌లో రాయలసీమ బ్యాక్ డ్రాప్ స్టోరీతో సినిమా తెరకెక్కుతుంది.
