సైబర్ నేరాలకు చెక్..కాలర్ ఎవరో స్క్రీన్ పైనే తెలుస్తుంది

సైబర్ నేరాలకు చెక్..కాలర్ ఎవరో స్క్రీన్ పైనే తెలుస్తుంది

ఇది డిఫాల్ట్​ సర్వీస్​ ప్రకటించిన ట్రాయ్, డాట్​

న్యూఢిల్లీ: ఇక నుంచి మన మొబైల్​ఫోన్​కు కాల్ చేసే వాళ్ల పేరు, వివరాలు తెలుసుకోవడానికి ట్రూకాలర్​వంటి థర్డ్​పార్టీ యాప్స్​ను వాడాల్సిన అవసరం ఉండదు. ఫోన్​ స్క్రీన్​పైనే కాలర్​ పేరు కనిపించనుంది. ఈ సర్వీసును డిఫాల్ట్​గా అందించాలని టెలికాం రెగ్యులేటర్​ ట్రాయ్​ (టాయ్​), డిపార్ట్​మెంట్​ ఆఫ్​ టెలికాం (డాట్​) నిర్ణయించాయి. సిమ్ ​కనెక్షన్​ కోసం ఉపయోగించిన గుర్తింపు కార్డులోని పేరే ఫోన్లో కనిపిస్తుంది. దీనినే కాలింగ్​ నేమ్​ ప్రెజెంటేషన్ అంటారు. 

గత  ఫిబ్రవరిలో ట్రాయ్​ 'ఇంట్రడక్షన్​ ఆఫ్​ కాలింగ్​ నేమ్​ ప్రెజెంటేషన్​ (సీఎన్​ఏపీ) ఇన్​ టెలికమ్యూనికేషన్​ నెట్​వర్క్స్'పై డాట్​కి సిఫార్సులు చేసింది. ఈ సర్వీసును కాల్​ స్వీకరించే సబ్​స్క్రయిబర్​​ కోరితేనే యాక్టివేట్​ చేయాలని ట్రాయ్​ సూచించింది. 

డాట్ ఈ సిఫార్సును తోసిపుచ్చింది. సీఎన్​ఏపీ సర్వీసును డిఫాల్ట్​గా మార్చాలని కోరింది. అవసరం లేదనుకునే వాళ్లు ఈ ఆప్షన్​ను  డిసేబుల్​ చేసుకునే అవకాశం ఉండాలని సూచించింది. ఈ ప్రతిపాదనకు డాట్​ఒప్పుకుంది.  సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలు వంటి మోసపూరిత కాల్స్​ నుంచి సబ్​స్క్రైబర్లను రక్షించడానికి ఈ సీఎన్​ఏపీ సేవను ప్రారంభించే ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా మొదలైంది.  

కాలింగ్​ లైన్​ ఐడెంటిఫికేషన్​ రెస్ట్రిక్షన్​ (సీఎల్​ఐఆర్​) సదుపాయాన్ని పొందిన టెలిఫోన్​ సబ్​స్క్రయిబర్ల పేర్లను చూపించకూడదన్న ట్రాయ్​ సిఫార్సును డాట్​ అంగీకరించే అవకాశం ఉంది.  సీఎల్​ఐఆర్​ సదుపాయం సాధారణ సబ్​స్క్రయిబర్లు, కేంద్ర ఇంటెలిజెన్స్​ ఏజెన్సీల అధికారులు,  ప్రముఖులకు అందుబాటులో ఉంటుంది.  బల్క్​ కనెక్షన్లు, కాల్​సెంటర్లు, టెలిమార్కెటర్లకు ఈ సదుపాయం వర్తించదు.  

 2జీ,  3జీ  యూజర్లకు బ్యాండ్​విడ్త్​ సమస్యల కారణంగా ఈ సర్వీసు అందుబాటులో ఉండదు.  ఈ సిఫార్సులను అంగీకరించిన తర్వాత, నోటిఫికేషన్​ తేదీ నుంచి ఆరు నెలలలోపు సీఎన్​ఏపీ ఫీచర్​ అందుబాటులోకి రావొచ్చు.