యూట్యూబ్ సంచలన నిర్ణయం.. వేలాది చైనా,రష్యా ఛానెళ్ల తొలగింపు

యూట్యూబ్ సంచలన నిర్ణయం.. వేలాది చైనా,రష్యా ఛానెళ్ల తొలగింపు

గూగుల్ సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది.ఫేక్ న్యూస్ షేర్ చేస్తున్న వివిధ దేశాలకు చెందిన 11వేల యూట్యూబ్ ఛానెళ్లను తొలగించింది. ఈ ఛానెళ్లు చైనా, రష్యాతోపాటు ఇతర దేశాలకు చెందిన దుష్ప్రచార కార్యక్రమాలు ప్రచార చేస్తున్నాయని తెలిపింది. తొలగించబడిన ఛానెళ్లలో 7వేల700కి పైగా చైనాకు చెందినవి. ఈ ఛానెళ్లు ప్రధానంగా చైనీస్, ఇంగ్లీష్ భాషలలో కంటెంట్‌ను పోస్ట్ చేశాయి. ఈ కంటెంట్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను ప్రోత్సహించడం, అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ను ప్రశంసించడం,US విదేశాంగ విధానంపై సానుకూల వ్యాఖ్యలు చేయడం వంటివి లక్ష్యంగా కంటెంట్ ఉన్నట్లు గూగుల్ సంస్థ తెలిపింది. 

మరో 2,000కి పైగా యూట్యూబ్ ఛానెళ్లు రష్యాకు సంబంధించినవి కాగా ఈ ఖాతాలు అనే భాషలలో మేసేజ్ లను వ్యాప్తి చేస్తున్నాయి. రష్యాకు మద్దతు ఇస్తూ ఉక్రెయిన్, NATO , పాశ్చాత్య దేశాలను విమర్శిస్తూ కంటెంట్ షేర్ చేస్తున్నాయి. ఈ కంటెంట్‌లో కొంత భాగం రష్యన్ ప్రభుత్వ మద్దతుగల సంస్థలు ,కన్సల్టింగ్ సంస్థలతో ముడిపడి ఉందని  గూగుల్ తెలిపింది. 

గతంలో రష్యా ఉక్రెయిన్‌పై దండయాత్ర చేసిన తర్వాత 2022 మార్చిలో రష్యన్ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న మీడియా సంస్థ యూట్యూబ్ ప్రధాన ఛానెళ్లను బ్లాక్ చేసింది. 2025 మేలో కూడా RTకి సంబంధించిన 20 యూట్యూబ్ ఛానెళ్లు, నాలుగు ప్రకటన ఖాతాలు, ఒక బ్లాగర్ బ్లాగును గూగుల్ తొలగించింది.

►ALSO READ | క్రిప్టో ఎక్స్ఛేంజీలపై హ్యాకర్ల వరుస దాడులు.. ఇన్వెస్టర్లకు నిపుణుల సూచన ఇదే..!

చైనా ,రష్యాతో పాటు, ఇరాన్, అజర్‌బైజాన్, టర్కీ, ఇజ్రాయెల్, రొమేనియా, ఘనా వంటి దేశాలకు సంబంధించిన తప్పుడు ప్రచార ఛానెళ్లను గూగుల్ తొలగించింది. ఇవి రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని షేర్ చేస్తున్నాయి.  ఇజ్రాయెల్,-పాలస్తీనా సంఘర్షణ ,అంతర్గత ఎన్నికలు వంటి ప్రాంతీయ సమస్యలను ప్రస్తావించింది. అజర్‌బైజాన్‌కు చెందిన 457 ఛానెళ్లు అజర్‌బైజాన్ అనుకూల కథనాలను ప్రచారం చేస్తూ, అర్మేనియా,దేశీయ విమర్శకులను విమర్శించాయి.

గూగుల్ చర్య:

ఈ తొలగింపులు గూగుల్ థ్రెట్ అనాలిసిస్ గ్రూప్ (TAG) ఆధ్వర్యంలో జరిగాయి.TAG ప్రపంచవ్యాప్తంగా ప్రభావ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది.తొలగిస్తుంది. మొత్తంగా ఈ చర్యలు ఆన్‌లైన్‌లో దుష్ప్రచారాన్ని అరికట్టేందుకు కస్టమర్లను తప్పుదారి పట్టించకుండా చూసేందుకు ప్రజాస్వామ్య చర్చలను బలహీనపరచకుండా నిరోధించడానికి గూగుల్ ఈ చర్యలు చేపడుతోంది.