క్రిప్టో ఎక్స్ఛేంజీలపై హ్యాకర్ల వరుస దాడులు.. ఇన్వెస్టర్లకు నిపుణుల సూచన ఇదే..!

క్రిప్టో ఎక్స్ఛేంజీలపై హ్యాకర్ల వరుస దాడులు.. ఇన్వెస్టర్లకు నిపుణుల సూచన ఇదే..!

పోయిన ఏడాది సైబర్ నేరగాళ్లు విజిరిక్స్ ఖాతాలపై చేసిన దాడిలో పెట్టుబడిదారులకు సంబంధించిన రూ.380 కోట్ల క్రిప్టోలను నిందితులు కొల్లగొట్టారు. ఇప్పటికీ దీనిపై దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. దీనిని మరచిపోక మునుపే మరో భారతీయ క్రిప్టో ఎక్స్ఛేంజీ అయిన కాయిన్ డీసీఎక్స్ ఖాతాను హ్యాక్ చేసిన నిందితులు రూ.19 వందల కోట్లకు పైగా విలువైన పెట్టుబడులను దోచుకెళ్లారు. అయితే ఈ నష్టాన్ని ట్రెజరీ నిధుల నుంచి భర్తీ చేయనున్నట్లు సంస్థ హామీ ఇచ్చింది. 

అయితే ప్రస్తుతం వరుసగా జరుగుతున్న సైబర్ దాడులతో కొందరు భారతీయ ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. తాజాగా కాయిన్ డీసీఎక్స్ సెక్యూరిటీ బ్రీచ్ తర్వాత వాలెట్లలో ట్రేడింగ్ తగ్గిందని క్రిబాకో క్రిప్టో రీసెర్చ్ వెల్లడించింది. ఇదే విషయాన్ని జెబ్ పే కూడా ధృవీకరించింది. ట్రేడింగ్ వాల్యూమ్స్ 60 శాతం తగ్గగా.. డబ్బు విత్ డ్రాలు కూడా భారీగా పెరిగాయని క్రిప్టో ఎక్స్ఛేంజీలు చెబుతున్నాయి. 
అయితే ఈ పరిస్థితులపై ఇన్వెస్టర్లు ఎలా ముందుకు సాగానీ.. సెక్యూరిటీ విషయంలో అసలు సంస్థలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాయనే అంశాలపై జియోటాస్ క్రిప్టో ఎక్స్ఛేంజీ సీఈవో విక్రమ్ సుబ్బురాజ్ కీలకమైన అంశాలను పంచుకున్నారు. ప్రస్తుతం జరిగిన సైబర్ నేరాలపై తాము కలిసిగట్టుగా పోరాడతామని, భారతీయ క్రిప్టో పరిశ్రమకు తమ మద్దతు ఉంటుందన్నారు. ముందుగా ఇలాంటి ఘటనలు నిరోధించటానికి ఇన్వెస్టర్లలో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని సుబ్బురాజ్ చెప్పారు. 

ALSO READ : వీడియోకాన్ లోన్ స్కామ్.. దోషిగా తేలిన ఐసీఐసీఐ మాజీ సీఈవో చందా కొచ్చర్!

జియోటాస్ సంస్థలో వారు సెల్ఫ్ కస్టడీతో ప్రైవేట్ వాలెట్లలో ప్రైవేట్ కీ కలిగిన భద్రతను అందిస్తున్నట్లు సుబ్బురాజ్ చెప్పారు. ఇందులో హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ వాలెట్లు ఉంటాయన్నారు. దీని కారణంగా ప్రతి ఇన్వెస్టర్ దగ్గర వారి పెట్టుబడి భద్రతకు సంబంధించిన కంట్రోల్ ఉంటుందని, అది వారిలో నమ్మకాన్ని పెంచుతుందన్నారు. అయితే వీటిలో ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న కీ భద్రత గురించి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. జియోటాస్ లాంటి సంస్థలు తమ ప్రథమ ప్రాధాన్యతను ఇన్వెస్టర్ల సేఫ్టీపైనే ఉంచుతున్నట్లు సుబ్బురాజ్ పేర్కొన్నారు.

ఇన్వెస్టర్ల పెట్టుబడులను రక్షించటానికి జియోటాస్ ఇన్టిట్యూషన్ గ్రేడ్ కోల్డ్ వాలెట్ సెగ్రిగేషన్, మల్టీ సిగ్నేచర్ ఆథరైజేషన్, రియల్ టైమ్ రిస్క్ మేనేజ్మెంట్ వంటి వ్యవస్థలను ఉపయోగిస్తున్నట్లు సుబ్బురాజ్ చెప్పారు. రక్షణ వ్యవస్థపైనే తమ ఎక్స్ఛేంజీ కార్యకలాపాలను నిర్మించినట్లు చెప్పిన సుబ్బురాజ్.. క్రిప్టో పెట్టుబడిదారులు కంగారు పడటం మానేసి తమ పెట్టుబడుల భద్రతను నిర్థారించుకునేందుకు సైబర్ సెక్యూరిటీ గురించి కొంత సమాచారాన్ని గ్రహిస్తూ ఉంటాలని సూచించారు. తమ సంస్థ భారత క్రిప్టో ఇన్వెస్టర్లకు క్లారిటీ, నమ్మకం, కంట్రోల్ అందిస్తూ వారిని చైతన్య వంతం చేస్తూ ముందుకు సాగుతున్నట్లు జియోటాస్ సీఈవో సుబ్బురాజ్ చెప్పారు. ఈ క్రమంలో మోసాల గురించి అవగాహన పెంచుకుంటూ వస్తున్న మార్పులు, ప్రమాదాలను అధిగమించటానికి ఇన్వెస్టర్లు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.