HHVMBookings: ‘హరిహర వీరమల్లు’ ప్రీమియర్ షో బుకింగ్స్ ఓపెన్.. షో టైం, టికెట్ రేట్ ఇదే

HHVMBookings: ‘హరిహర వీరమల్లు’ ప్రీమియర్ షో బుకింగ్స్ ఓపెన్.. షో టైం, టికెట్ రేట్ ఇదే

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. జులై 24, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ మూవీ పెయిడ్ ప్రీమియర్ షోలు ఇవాళ రాత్రి (జులై 23న) పడనున్నాయి. ఈ సందర్భంగా.. మేకర్స్​​ ఆంధ్రాతో పాటు నైజాం పెయిడ్ ప్రీమియర్ షో బుకింగ్స్ ఓపెన్ చేశారు. ఇవాళ రాత్రి 9:36 గంటలకు పెయిడ్ ప్రీమియర్స్ సెలెక్టెడ్ థియేటర్స్లో పడనున్నాయి. అయితే, ఇది మొదట 9 గంటలకే అని చెప్పగా.. ఇప్పుడు 9:36 నిమిషాలకు షో పడనుందని ప్రకటించారు. ఈ షోకి టికెట్ ధర రూ.600 ఉండగా..+ GSTకలుపుకుని రూ.708గా ఉంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఓవర్సీస్లో టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. 

గతేడాది పుష్ప 2 తొక్కిసలాట తర్వాత.. తెలంగాణ ప్రభుత్వం స్టార్ హీరోల సినిమాల్లో.. హరిహర వీరమల్లు సినిమాకు మాత్రమే ఈ ప్రత్యేక షోలకి పర్మిషన్ ఇచ్చింది. అంతేకాదు టిక్కెట్ల పెంపుదలకు కూడా అనుమతి ఇచ్చింది. ఇదిలా ఉంటే.. అయితే, ఇది ఏపీ డిప్యూటీ సీఎం, స్టార్ హీరో పవన్ కళ్యాణ్ అవ్వడం చేత భారీగా జనాలు వచ్చే అవకాశం ఉంది. రోడ్లు రద్దీగా మారడమే కాదు.. థియేటర్లో జనాల తాకిడి కూడా మరింతగా ఉండే ఛాన్స్ కూడా లేకపోలేదు. మరి.. క్రౌడ్ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో తెలియాల్సి ఉంది.

తెలంగాణ వీరమల్లు టికెట్ ధరలు:

సినిమా విడుదలైన జూలై 24వ తేదీ నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు అంటే పది రోజుల పాటు టికెట్ రేట్ల పెంపుకు సర్కార్ ఒకే చెప్పింది. సింగిల్ స్క్రీన్ థియేటర్స్‎లో టికెట్ ధర గరిష్టంగా రూ.150.. మల్టీప్లెక్స్‎ల్లో హయ్యెస్ట్ రూ. 200 పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం వీలు కల్పించింది.

ALSO READ : ట్రెండింగ్లో ‘హరిహర వీరమల్లు’ బాయ్కాట్.. అసలు కారణం ఇదేనా..? 

జూలై 24 నుంచి 27 వరకు సింగిల్ స్క్రీన్ లలో రూ.150, మల్టీప్లెక్స్‎ల్లో రూ.200 ధర పెంచి టికెట్లు విక్రయించుకునేందుకు అవకాశం కల్పించింది. జూలై 28 నుంచి ఆగస్ట్ 2 వరకు సింగిల్ స్క్రీన్ లలో రూ.106, మల్టీప్లెక్స్‎ల్లో రూ.150 టికెట్ ధర పెంపునకు అనుమతి ఇచ్చింది. ఈ టికెట్ రేట్లకు జీఎస్‎టీ అదనమని జీవోలో స్పష్టం చేసింది ప్రభుత్వం.