
హైదరాబాద్ వ్యాప్తంగా నిన్నటి నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. మరో మూడు రోజులు కూడా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో సిటీలో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో అవసరమైతేనే బయటకు రావాంటున్నారు అధికారులు. హైదరాబాద్ లో వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద ట్రాఫిక్, జీహెచ్ఎంసి, హైడ్రా, వాటర్ బోర్డు అధికారులు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రాజ్ భవన్, కేసీపీ జంక్షన్ ఫైతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వాటర్ స్టోరేజ్ ఇంకుడు గుంతలతో వాటర్ లాగిన్ సమస్య తగ్గి ట్రాఫిక్ క్లియర్ అవుతుందంటున్నారు పోలీసులు..
►ALSO READ | వైరల్ వీడియో: కన్న కూతురిపై తండ్రి శాడిజం.. కాళ్లతో తంతూ పైశాచికం
రానున్న రెండు రోజులు వర్షాల నేపథ్యంలో ప్రజలు రెయిన్స్ కోర్ట్స్ ధరించి ప్రయాణాలు చెయ్యాలని సూచించారు. రోడ్లపై వాటర్ లాగిన్ పాయింట్స్ వద్ద వాటర్ నిలవకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కానిస్టేబుల్ లను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. వర్షం పడుతున్న సమయంలో రోడ్ల పక్కన వాహనాలు నిలపడం కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని చెబుతున్నారు ట్రాఫిక్ పోలీసులు. ప్రజలు వర్షం కురుస్తున్న సమయంలో మెట్రో స్టేషన్ల కింద వాహనాలు నిలపొద్దని సూచించారు ట్రాఫిక్ పోలీసులు. వర్షాల కారణంగా రోడ్లపై వెళ్లే వాహనదారులు ప్రమాదాలు జరగకుండా పలు జాగ్రత్తలు పాటించాలంటున్నారు ట్రాఫిక్ పోలీసులు..