హైదరాబాద్ మూసాపేటలో ఏంటీ దారుణం..? నైట్ టైం ఒక ఫ్యామిలీ కారులో వెళుతుంటే..

హైదరాబాద్ మూసాపేటలో ఏంటీ దారుణం..? నైట్ టైం ఒక ఫ్యామిలీ కారులో వెళుతుంటే..

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో కొందరు యువత గంజాయికి బానిసై విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. సిటీలో ప్రజలను ఇబ్బంది పెడుతూ వీధుల్లో హల్ చల్ చేస్తున్నారు. మూసాపేట్ నడిరోడ్డుపై ఒక యువకుడు మంగళవారం రాత్రి చేసిన రచ్చ అంతాఇంతా కాదు. మూసాపేట్ మెయిన్ రోడ్డుపై మంగళవారం రాత్రి ఒక ఫ్యామిలీ కారులో వెళుతుండగా ఒక యువకుడు కారును అడ్డగించాడు. గంజాయి మత్తులో ఏం చేస్తున్నాడో కూడా తెలియనంత స్థితిలో కారు పైకి ఎక్కి నానా హంగామా చేశాడు. ఆ యువకుడి ప్రవర్తనతో కారులో ఉన్న ఫ్యామిలీ బెదిరిపోయింది. అతని ప్రవర్తనకు భయపడిపోయి కారులో నుంచి కిందకు కూడా దిగలేదు.

కారుపై నుంచి కిందకు దిగాలని ప్లీజ్ దిగమని రిక్వెస్ట్ చేసింది. అంత పద్ధతిగా చెబుతున్నా ఆ యువకుడు లెక్క చేయలేదు. నోటికొచ్చినట్లు మాట్లాడుతూ పిచ్చిగా ప్రవర్తించాడు. కారు దిగి వెళ్లమన్నా వెళ్లనే లేదు. ఆ తర్వాత ఆ కుటుంబం పరిస్థితి చూసి జాలిపడిన కొందరు యువకులు ఆ యువకుడిని కారుపై నుంచి కిందకు దించి ఆ ఫ్యామిలీ వెళుతున్న కారుకు లైన్ క్లియర్ చేశారు. ఆ యువకుడిని కిందకు దించిన యువకులకు ఆ ఫ్యామిలీ థ్యాంక్స్ చెప్పి కారులో వెళ్లిపోవడంతో ఆ కుటుంబం సేఫ్గా అక్కడ నుంచి బయటపడింది.