Vijay Deverakonda: డెంగ్యూ నుంచి కోలుకున్న విజయ్ దేవరకొండ.. 'కింగ్ డమ్' ప్రమోషన్స్‌కు రౌడీ స్టార్ రెడీ !

Vijay Deverakonda: డెంగ్యూ నుంచి కోలుకున్న విజయ్ దేవరకొండ.. 'కింగ్ డమ్' ప్రమోషన్స్‌కు రౌడీ స్టార్ రెడీ !

 టాలీవుడ్ రౌడీస్టార్ విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda ) కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి ( Goutham Tinnanuri ) దర్శకత్వం వహించిన 'కింగ్ డమ్' ( Kingdom ) విడుదలకు రెడీ అయింది. జూలై 31న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. విజయ్ ను బీకర, హై ఆక్టేన్ పాత్రలో చూపిస్తూ ఇప్పటికే విడుదల చేసిన తొలి ప్రోమోతో అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది.  ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు కుడా సిద్ధం చేస్తున్నారు.

గత కొన్ని రోజులుగా విజయ్  డెంగ్యూతో బాధపడుతుండటంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఆయన  అనారోగ్యం నుంచి కోలుకున్నారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి నుంచి విజయ్ డిశ్చార్జ్ అయ్యారు.  ప్రస్తుతం ఆయన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే  మరో వారం రోజుల్లో 'కింగ్ డమ్'  సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో కాస్త వెనుకబడి ఉంది. ఇప్పటికే దీనిపై కాస్త ఆందోళన చెందుతున్నారు అభిమానులు, మేకర్స్. ఈ నేపథ్యంలో వైద్యులు విశాంత్రి తీసుకోవాలని చెప్పినప్పటికీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విజయ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.  ఈ సినిమాను ప్రమోట్ చేయాడానికి సెలెక్టివ్ మీడియా ఇంటరాక్షన్స్ కు  సిద్ధమైనట్లు తెలుస్తోంది. 

►ALSO READ | HHVMBookings: ‘హరిహర వీరమల్లు’ ప్రీమియర్ షో బుకింగ్స్ ఓపెన్.. షో టైం, టికెట్ రేట్ ఇదే

 దాదాపు రూ. 100 కోట్లతో నిర్మించిన 'కింగ్ డమ్' పై భారీగానే అంచనాలు ఉన్నాయి . ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బొర్సె( Bhagyashree Borse ) హీరోయిన్‌గా నటిస్తోంది. మరో పవర్ఫుల్ నటుడు సత్యదేవ్ (Satya Dev )కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ( Anirudh Ravichander ) సంగీతం అందిస్తుండటంతో, పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.  చిత్రాన్ని జూలై 31న గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్  తో  'VD 14' పేరుతో చేయబోతున్నారు.  మరొకటి రవికిరణ్ కోలా దర్శకత్వంలో 'SVC59 ' అనే మరో చిత్రంలో చేస్తున్నారు.  మరో వారం రోజుల్లో విడుదల కానున్న 'కింగ్ డమ్ 'బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి మరి.