పూజకొచ్చిన కొత్త కారును ధ్వంసం చేశారు

పూజకొచ్చిన కొత్త కారును ధ్వంసం చేశారు

శ్రీశైలం సాక్షి గణపతి ఆలయం వద్ద కారు బీభత్సం సృష్టించింది. కొత్తగా కొన్న కారు వాహన పూజ పూర్తి చేసుకుని నిమ్మకాయలు తొక్కించే క్రమంలో అదుపుతప్పి ఆలయంలోని భక్తులపైకి దూసుకెళ్లింది. కారులో వున్న వ్యక్తి బ్రేక్ తొక్కబోయి  రైజింగ్ చేయడంతో కారు ఆలయంలోకి దూసుకు వెళ్ళింది. దీంతో ఆలయంలోని క్యూలైన్‌ వద్ద తీర్థ ప్రసాదాలు తీసుకుంటున్న ఐదుగురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు సంగారెడ్డి జిల్లా వాసులు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనకు కారణమైన కారుపై స్థానికులు దాడి చేసి కారు అద్దాలు పగలగొట్టారు.