
బోధన్, వెలుగు : బోధన్ పట్టణంలో మద్యంసేవించి వాహనం నడిపిన చిక్కడపల్లి గ్రామానికి చెందిన శేఖర్, పెగడపల్లి గ్రామానికి చెందిన శ్రీరామ్, వెంకటేశ్ వర్మ కు సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ శేష తల్ప సాయి రెండు రోజుల జైలు శిక్ష విధించారు.
బోధన్ పట్టణంలోని శక్కర్ నగర్ కాలనీకి చెందిన షేక్ అయూబ్, మూల వినోద్ మద్యం మత్తులో డయల్ 100కు పలుమార్లు ఫోన్ చేసినందుకు ఒకరోజు జైలు శిక్ష విధించినట్లు బోధన్ పట్టణ సీఐ వెంకట నారాయణ తెలిపారు.