పాల్వంచ, వెలుగు: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కమ్యూ నిస్టులు లోతైన రాజకీయ అవగాహనతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మంగళవారం పాల్వంచలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు నరాటి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సీపీఐ భద్రాద్రికొత్తగూడెం జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో మతోన్మాద శక్తులు బలపడుతున్న తరుణంలో లౌకికవాదాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగితే ప్రజల్లో మంచి గుర్తింపు ఉంటుందన్నారు.
